Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు ఓట్లేసి మోసపోయిన మొట్టమొదటి వర్గం దళితవర్గమే

– హంతకుడిని పార్టీ ఎమ్మెల్యే పరామర్శించడం అంటే మోసకారి సస్పెన్షన్ కాదా?
– హంతకుడి యోగక్షేమాలు తెలుసుకు రమ్మని ధనలక్ష్మీని జగన్ రెడ్డే పంపాడా?
– పూనూరి గౌతంరెడ్డిని సస్పెండ్ చేసి తర్వాత ఎపిఎస్ఎఫ్ఎల్ చైర్మన్ ను చేశారు
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ దళిత వర్గాలపై కపటప్రేమ వలకబోస్తున్నాడు. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లెలో చేసిన పర్యటనలో జగన్ అబద్దాలు ప్రచారం చేశారు. జగన్ కు ఓట్లేసి మోసపోయిన మొట్టమొదటి వర్గం దళితవర్గమే. చంపడానికి కూడా మాకు హక్కు కల్పించారనేట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చంపి డోర్ డెలివరి చేస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని చంపి.. 48 గంటలు డ్రామా నడిపిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో రాచమర్యాదలు చేస్తూ.. శాసనసభ్యురాలిచే బయట పాలాభిషేకం చేయడం సిగ్గుచేటు.

జిల్లాలో కులాలవారీగా విభజించి కులచిచ్చు పెడుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును తప్పించడానికి ప్రయత్నం చేసి కుదరని పక్షంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైసీపీవి దొంగసస్పెన్షన్లు, మోసపూరిత సస్పెన్షన్లు. రంపచోడవరంనియోజకవర్గంలో దళితులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ. హంతకుడు అనంతబాబును కాపాడటమే జగన్ రెడ్డి విధానం. వైసీపీ ఎమ్మెల్యే హంతకుడికి పాలాభిషేకం చేస్తుంటే జగన్ రెడ్డికి పట్టదా?మోసకారి సస్పెన్షన్ చేసి హంతకుడిని అన్ని విధాల కాపాడుతున్నాడు జగన్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ నాగులాపల్లి ధనలక్ష్మీ మొన్న జైల్లో హంతకుడు అనంతబాబును పరామర్శించి వచ్చింది. నిన్నఅదే హంతకుడికి పాలాభిషేకం చేసింది.

అనంతబాబు ఒక హంతకుడు. దళిత వర్గాల వ్యతిరేకి. అనంతబాబును కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తుంది. అందుకే జుడీషియల్ కస్టడీలో ఉన్న అనంతబాబును పోలీసులు తమ కస్టడీకి తీసుకోవడం లేదు. పోలీసులు హత్య జరిగిన వారం రోజుల వరకు అనంతబాబును దాచిపెట్టి అరెస్టు చేయలేదు. అనంతబాబు తప్పు చేయలేదు గనుకనే దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ నిస్సిగ్గుగా సమర్ధించాడు. దళిత సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ధర్నాలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేశారు. అంటే జగన్ రెడ్డి పార్టీ నుంచి అనంతబాబును సస్సెండ్ చేసింది కేవలం దళిత వర్గాలను శాంతింపచేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది.

పరోక్షంగా అనంతబాబును బయటికి తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది. అనంతబాబుకు జైల్లో అన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి. ప్రత్యేక రూం, బెడ్, పుడ్ ఏర్పాట్లు చేశారు. 14 రోజుల రిమాండ్ లో జైల్లో మరో ఖైదీపై అనంతబాబు దాడి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి కనుసన్నల్లో వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ హంతకుడు అనంతబాబును జైలుకెళ్లి పరామర్శించినా ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ సస్పెండ్ చేసిన హంతకుడిని పార్టీ ఎమ్మెల్యే పరామర్శించడం అంటే మోసకారి సస్పెన్షన్ కాదా? హంతకుడి యోగక్షేమాలు తెలుసుకు రమ్మని ధనలక్ష్మీని జగన్ రెడ్డే పంపాడా? పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెబుతూ పార్టీ నుంచి అన్ని విధాల సహకరించడమే జగన్ రెడ్డి రివర్స్ విధానం.

గతంలో కూడా వంగవీటి మోహన రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడకు చెందిన కబ్జాకోరు పూనూరి గౌతంరెడ్డి ని సస్పెండ్ చేసి తర్వాత ఎపిఎస్ఎఫ్ఎల్ చైర్మన్ ను చేశారు. ఇలాంటి మోసకారి సస్పెన్షన్లు చేసి దళితులను మోసం చేద్దామనుకున్నారా జగన్ రెడ్డి. దళితులను చంపేసి, శవాన్ని ఇంటి వద్దకే పార్శిల్ చేసి తీసుకెళ్లి అప్పగించిన అనంతబాబుపై ఉత్తుత్తి చర్యలు తీసుకుంటున్న జగన్ రెడ్డిని దళితులు క్షమించరు. హంతకులకు జగన్ రెడ్డి అండగా నిలబడుతూ…..దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నాడు.

సంక్షేమం, సమన్యాయం, ఆర్థిక స్వావలంబన అంటూ మోసపూరిత మాటలు చెబుతూ.. దళిత, గిరిజన, బహుజనులను నిలువు దోపిడీ చేస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. బెయిల్ ఇవ్వడానికి కేసులో తావులేదు. అనంతబాబుకు గనుక బెయిల్ వస్తే తీవ్ర స్థాయిలో దళితులు తమ నిరసన తెలియజేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE