Suryaa.co.in

Andhra Pradesh

పవన్ పోరాడాల్సింది పార్టనర్ బీజేపీ మీదే..

– కేంద్రంపై పోరాటం చేయలేని పవన్.. రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడిస్తే ఎలా..?
– ఆందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయడమేంటో పవన్ కల్యాణే చెప్పాలి.
– వైయస్ఆర్సీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారనేదే పవన్ కల్యాణ్ ఏడుపు
– ఏం జరిగినా పవన్ కల్యాణ్ ఆవుకథలా జగన్ గారిని విమర్శించడమే పని
– పవన్ సినిమాల్లో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో చెబితే.. నిజాయితీ ఏంటో తెలుస్తుంది
– రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా.. సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా..?
– జగన్ గారు మంచి చేసినా హర్షించలేడు.. చంద్రబాబు దుర్మార్గం చేసినా ప్రశ్నించలేడు.. దటీజ్ పవన్
– ఇది ప్రజాస్వామ్య దేశం… ఇక్కడ వర్గ శత్రువులేంటి..?
– ప్రజాస్వామ్యం, విప్లవ పుస్తకాలు వేర్వేరుగా పవన్ చదవాలి..
– ఏడాది సినిమాలు.. కాల్ షీట్లు లేవని నాలుగు రోజులు రాజకీయాలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన నాయకులు తయారయ్యారు..
– రాష్ట్ర రాజకీయాల్లో నిన్న ఒక పరిణామం.. ఇవాళ ఒక పరిణామం చూశాం. ప్రత్యేక హోదా ను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. మీరెందుకు తీసుకురారు అని నిన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. అంటే చంద్రబాబేమో వలకబోస్తాడు.. ఆయన వలకబోసిన దానిని మేము ఎత్తాలా..?
– కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో జత కట్టి, వారికి పార్టనర్ గా ఉన్న పవన్ కల్యాణ్… కేంద్రం ఆస్తి అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను డిజ్ ఇన్వెస్ట్ మెంటు పాలసీలో భాగంగా ప్రైవేటీకరించాలని చూస్తుంటే.. ఆయన మంగళగిరిలో దీక్ష చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. కేంద్రాన్ని ప్రశ్నించటానికి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు..? ఎదురుగ్గా.. మీ సైకో ఫ్యాన్స్ ను పెట్టుకుని వారు ఈలలు వేస్తుంటే.. మీరు ఊగిపోతే సరిపోతుందా.. ? రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి చిత్రవిచిత్రమైన నాయకులు తయారయ్యారు.
పవన్ కల్యాణ్ ఆవు కథ..
– ఆవు కథ మాదిరిగా.. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, ఏం జరిగినా జగన్ మోహన్ రెడ్డిగారిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రతిసారీ పవన్ కల్యాణ్ చెబుతున్న ఆవుకథ చూస్తుంటే.. ఆ లక్షణాలు బాగా ఉన్నట్టు అర్థమవుతుంది. గతంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడూ మా మీదే పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడు. విశాఖ ఉక్కు కోసం నిరాహార దీక్ష చేసి, దాని గురించి ఏదో చివరిన రెండు మాటలు మాట్లాడి, మిగతా సమయం అంతా జగన్ గారిని విమర్శించడానికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది ఎంపీలు ప్రజలు ఇచ్చారు అన్న ఏడుపు, దుగ్ధే పవన్ కల్యాణ్ ప్రసంగంలో కనిపించింది. ఎంతసేపటికీ జగన్ గారిపై దుమ్మెత్తిపోయడం కాదు.. చేతనైతే కేంద్రానికి అల్టిమేటం ఇవ్వాలి.
పవన్ బీజేపీని అడగరట.. పార్టనర్ షిప్ కొనసాగిస్తారట..
– విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామంటుంటే, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎంపీలు కాదు, అలా చేయటానికి వీల్లేదు అని అంటున్నాం, మా ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది.
– పవన్ కల్యాణ్ మాత్రం ఏమీ చేయరట. బీజేపీని ప్రశ్నించరట. బీజేపీతో పార్టనర్ షిప్ ఇంకా కొనసాగిస్తారట. కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే మీ రాజకీయాలా.. లేక ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారా..? అని నిలదీస్తున్నాం.
బాబుది వారసత్వ రాజకీయం కాదా…
దేశంలో వారసత్వ రాజకీయాలను ఎదుర్కొంటున్న నాయకుడు మోడీ గారు, అందుకే ఆయనతో స్నేహం అని చేస్తున్నానని చెబుతున్న పవన్ కల్యాణ్.. మరి చంద్రబాబు నాయుడిది ఏ రాజకీయమో చెప్పాలి. చంద్రబాబుది వారసత్వం రాజకీయం కాదా..? – అసలు పవన్ కల్యాణ్ కథేమిటి..? పవన్ కల్యాణ్ సినిమాల్లో, రాజకీయాల్లో నిలబడటానికి కారణం ఎవరు, వాళ్ళ గురించి ఈరోజు ఆయన మరిచిపోయాడు.
పవన్ కల్యాణ్… కేవలం రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా.. సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా.. ?
పవన్ సినిమాలు ఆపాల్సిన కర్మ మాకేంటి..?
పవన్ కల్యాణ్ సినిమాలు ఆపాల్సిన కర్మ మాకేంటి..? అన్ని వర్గాల సంక్షేమం కోసం, సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలన్న పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. పన్నులు ఎగ్గొట్టి, అక్రమంగా వేల కోట్ల రూపాయలు కాజేయాలనుకునే పరిశ్రమలోని కొంతమందికి మేం వ్యతిరేకం. ప్రేక్షకులు, చిన్న హీరోలు, చిన్న నిర్మాతలు బతకాలని.. అందరూ బతకాలనే ఉద్దేశంతో, ప్రజలు, నిర్మాతలు కోరుకుంటే ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం తెస్తుంది. బెనిఫిట్ షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తప్పేంటో పవన్ కల్యాణ్ చెప్పాలి.
సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు… సుభాష్ చంద్రబోస్ తదితర జాతీయ నేతల పేర్లు చెబుతున్నాడు. ఈ మధ్య చేగువేరాను పవన్ కల్యాణ్ మరిచిపోయినట్టున్నాడు. ఇన్ని నీతులు చెబుతున్న ఆయన.. తన సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో వాస్తవాలు చెప్పాలి. ఈ విషయం చెప్పటానికి సుభాష్ చంద్రబోస్ వారసులే కానక్కర్లేదు.. ఆయన నిజాయితీ ఎంతో అక్కడే కనిపిస్తుంది. రెమ్యునరేషన్ రూ. 10 కోట్లు తీసుకుంటున్నానని చెబుతాడు, తీసుకునేది అంతకంటే ఎక్కువే. మరోవైపు దొంగ రాజకీయాలు చేసేది మీరే.
మోడీ ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడే ధైర్యం లేదా..
రూ. 20 వేల కోట్ల అప్పు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తుంటే.. ఏపీ అప్పుల గురించి ఏంటి అని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కి కేంద్రంలో, ఆయన పార్టనర్ గా ఉన్న మోడీ గారి ప్రభుత్వం అప్పు గురించి ప్రశ్నించే ధైర్యం లేదా..? కేంద్రం అప్పు రూ. 121 కోట్లకు పైగా ఉందన్న సంగతి మీకు గుర్తుకు రాదా..?
విశాఖ ఉక్కు కేంద్రానిదా.. కాదా..? కేంద్రంతో మీరు భాగస్వామ్యం చేయటం లేదా..? పోరాడాలనుకుంటే కేంద్రంపై పోరాడు. మేం చిత్తశుద్ధితో పార్లమెంటులో అడుగుతున్నాం. మీ మాదిరిగా, గంటకోరకంగా మాట్లాడే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదు.
కొత్తగా ఇవాళ దామోదర సంజీవయ్య గారు పవన్ కల్యాణ్ కు గుర్తుకొచ్చారు. ఆయన 1972లో మరణించారు. ఆయన చనిపోయిన 50 ఏళ్ళ తర్వాత, మీరు రాజకీయాల్లోకి వచ్చిన 14 ఏళ్ళ తర్వాత.. మీకు కొత్త పుస్తకాలు దొరికినప్పుడల్లా ఆవుకథలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్… పొగిడినన్నాళ్ళు చంద్రబాబును పొగిడారు. మోడీని తిట్టినంతకాలం తిట్టారు. మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని ఆరోజు మాట్లాడి.. ఇప్పుడు పొగుడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ రసాయనక చర్య ఏం జరుగుతుందనేది ప్రజలు ఆలోచిస్తున్నారు.
అమరావతిలో 2 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చారనా..?
అమరావతి ఒక్కటే రాజధాని కావాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. మంగళగిరి పక్కనే ఆయన 2 ఎకరాలు గిఫ్ట్ కొట్టావనా అమరావతే ఏకైక రాజధాని కావాలని అడుగుతున్నావు..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన అమరావతి రైతుల దగ్గరకు వెళ్ళి మాట్లాడిన మాటలు మరచిపోయావా..?
2024లో అధికారంలోకి మిమ్మల్నా, మీ బాసునా..?
2024లో అధికారంలోకి ఎవర్ని తీసుకురావాలి పవన్ కల్యాణ్. మిమ్మల్నా.. మీ బాసుని తీసుకురావాలా..?. పవన్ కల్యాణ్ మాట్లాడేదానికి, చేసేదానికి పొంతన లేకుడా రాజకీయాలు చేస్తున్నాడు. ఇటువంటి నిలకడ లేని, స్థిరత్వంలేని మిమ్మల్ని అధికారంలోకి ఎలా తీసుకొస్తారు..?
విశాఖలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చాడు, కేంద్రానికి కాదు. కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదు. మా మీద విమర్శలా.. ప్రభుత్వంపై విరుచుకుపడటమా.. ఇదెక్కడి న్యాయం..?పవన్ కల్యాణ్ వేరే వేరే విషయాల్లో నిమగ్నమయ్యారు.. వేరే వేరేవి అందుకుంటున్నారు కాబట్టి, మనం ఆయనకు చెప్పినా అర్థం కాదు. ఉదాహరణకు ఎవరికైనా 2 ఎకరాలు భూమి ఉంటే ఎవరి పర్మిషన్ అడగాలి.. కేంద్ర ప్రభుత్వానికి సొంత ఆస్తిగా ఉన్న విశాఖ ఉక్కును వాళ్ళు డిజ్ ఇన్వెస్ట్ మెంటు చేస్తుంటే అడగాల్సింది ఎవరిని, కేంద్రాన్ని కాదా..?కేంద్రం చేస్తున్నది అన్యాయం, అక్రమం అని సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. ఇది పవన్ కల్యాణ్ కు , చంద్రబాబుకు మాత్రం కనిపించడం లేదు.
సినిమా కాల్ షీట్లు లేవని దీక్షలా..
మీ మిత్రులను ప్రశ్నించలేని వాడివి.. మా రాజకీయాలను ఎలా ప్రశ్నిస్తావు పవన్ కల్యాణ్..? ఆరు నెలలకొకసారి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుందా. సినిమా కాల్ షీట్లు లేవని, ఈరోజు 8 గంటలు నిరాహార దీక్ష పేరుతో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి వెళ్ళడం దురదృష్టకరం.
మీకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేంటో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనేంటో తెలుసుకోండి. కేంద్రం మీద పోరాటం చేయలేని మీరు.. రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడిస్తే.. ప్రయోజనం ఉఁడదు.ఉద్యమం పేరుతో పవన్ కల్యాణ్ నడుపుతున్నదాన్ని, ప్రజలు ఒక నాటకంగా చూస్తారు. చిత్తశుద్ధి ఉంటే, నిరాహార దీక్ష కేంద్రం మీద చేయవచ్చుకదా.. అసలు ఆందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటమేంటి..?. పోరాట క్రమంలో అందరూ కలుస్తారు తప్ప.. అందరూ రండి నేను పోరాటం చేస్తాను అని పవన్ కల్యాణ్ అనడం హాస్యాస్పదం.
పులి వచ్చి దాడి చేసే అవకాశం ఉంది, మీరంతా నా ఇంటి చుట్టూ పడుకోండి, మీరేం భయపడాల్సిన పనిలేదు అని అన్నట్టు.. పవన్ కల్యాణ్ ఉద్యమం, డైలాగులు ఉన్నాయి. కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీమీద ఉన్న దుగ్ధ, కక్షతోనే ఇటువంటి విమర్శలు చేస్తున్నాడు. ఇది సరైన విధానం కాదు.
చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కల్యాణ్ ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి తప్ప.. మరొకటి కాదు. పోరాడాల్సింది మీ పార్టనర్ బీజేపీతోనే అన్నది ఇప్పటికైనా పవన్ గుర్తెరగాలి.మేం అధికారంలో ఉన్నామనే బాధ, చంద్రబాబు అధికారంలో లేరన్న బాధే పవన్ కల్యాణ్ ది.
అమరావతి కోసం చేసినట్టే విశాఖ స్టీల్ కోసం పోరాటం చేయొచ్చుకదా..
అమరావతి కి సంబంధించి కేంద్రానికి ఏదో చెప్పానని, ఈ ప్రకటన రెండేళ్ళ తర్వాత వచ్చిందని చెబుతున్న పవన్ కల్యాణ్.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు. అలానే పోరాటం చేయొచ్చుగా..
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం.. ప్రజాస్వామ్య యుతంగా మేం పోరాటం చేస్తున్నాం.. పవన్ కల్యాణ్ ఉద్దేశం ప్రకారం సాయుధ పోరాటం చేయాలేమో.. ? లేక పవన్ కల్యాణ్ తో కలిసి చేస్తేనే పోరాటమా..?
విశాఖ ఉక్కు మీద ప్రేమ ఉంటే, జనసేన ప్ల కార్డు పట్టుకుని ఢిల్లీ వెళ్ళి, బీజేపీ ఆఫీసు ముందు నిలబడి పోరాటం చేయాలి. బీజేపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీరు ఢిల్లీలో అడగవచ్చుగా, ఆ ధైర్యం లేదా.. ఎటూ, ఎన్నికల్లో సీట్ల పంపకం చేసుకుంటున్నారు కదా..
ఇది కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సమస్య. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నది కాదు అన్నది పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి. సమస్య పరిష్కారం మీ పార్టనర్ తో ఉన్నప్పుడు.. విశాఖ ఉక్కు గురించి మాట్లాడటం లేదంటే.. ఏమిటి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రహస్యం అన్నది కూడా ప్రజలకు చెప్పాలి.
జగన్ గారికి ఓట్లేశారన్నదే పవన్ బాధ
ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారికి ఓట్లు వేశారన్న బాధే తప్ప… ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ రాలేదన్న బాధ బాబు, పవన్ లకు లేదు. ఎన్నికల్లో ప్రజలు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. ఎన్నికలను అత్యంత ఖరీదుగా చేసింది, డబ్బు ప్రభావాన్ని తీసుకువచ్చింది చంద్రబాబు అన్నది గుర్తు లేదా..?జగన్ మంచి చేసినా హర్షించలేడు.. చంద్రబాబు దుర్మార్గం చేసినా ప్రశ్నించలేడు.. అతనే పవన్ కల్యాణ్.రౌడీయిజం, గూండాయిజం అని సినిమా డైలాగులు చెబుతున్నాడు. నిలబడిన రెండు చోట్లా ఓడిపోయి.. తడాఖా ఇక ఎక్కడ చూపిస్తావు పవన్ కల్యాణ్..
ప్రజాస్వామ్యం, విప్లవ పుస్తకాలు వేర్వేరుగా చదవాలి..
పవన్ కల్యాణ్ చేగువేరా వారసుడా… లేక తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం తెస్తాడా.. లేక ఎవరితో పోరాటం చేస్తాడు.. ఎక్కడ చేస్తారు.. ఎలా చేస్తారు.. మొత్తం మీద ఆయన ఒక కన్ఫ్యూజన్ మాస్టర్. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం, విప్లవ పుస్తకాలు వేర్వేరుగా చదవమని సలహా ఇవ్వండి. వర్గ శత్రువులు అంటే ఏమిటి.. సాయుధ పోరాటం, తుపాకీ ద్వారానే రాజ్యాధికారం రావాలనుకునే చారు మజుందార్ లాంటి కమ్యూనిస్టులు వర్గ పోరాటాన్ని, వర్గ శత్రువులపై పోరాటాలు చేశారు.ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వర్గ శత్రువులేంటి..?బోస్ సిద్ధాంతం, కమలం సిద్ధాంతం, చేగువేరా సిద్ధాంతం.. ఇవన్నీ అయిపోయి, ఇప్పుడు సంజీవయ్య గారి సిద్ధాంతం అని పవన్ మాట్లాడారు.. ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకోండి. సలహాలు తీసుకోండి… అని హితవు చెబుతున్నాం.
ఏడాది సినిమాలు.. నాలుగు రోజులు రాజకీయాలు..
ప్రజలకోసం ఏం చేసినా జగన్ మోహన్ రెడ్డిగారు చేయాలి తప్పితే.. మీ వల్ల ఏమవుతుంది..? నాలుగు రోజులు రాజకీయాలు.. ఏడాది పాటు సినిమాలు మీవి. ప్రజల కోసం ఎవరితోనైనా పోట్లాడాలి, విమర్శించాలి. ఎప్పుడు ఎవరితో ఉంటావో పవన్ కల్యాణ్ కే తెలియదు. ఇక, మేమేం చెబుతాం.
చంద్రబాబు కుమారుడు లోకేష్, పవన్ కల్యాణ్ లు కనీసం కౌన్సిలర్లు కూడా గెలవలేదు, ప్రజలు వీళ్ళను రిజక్ట్ చేశారు. వీళ్ళు ప్రజల్లో గెలిచిన వారు కాదు, ప్రజా నాయకులు కాదు.
చివరిగా..
2024లో ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలని పవన్ కల్యాణఅ చెప్పారా.. లేక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి దీక్ష చేశానని చెప్పారో.. అర్థం కాని పరిస్థితి. శృతి లేని రాగాలు తీస్తున్నాడు పవన్ కల్యాణ్.

LEAVE A RESPONSE