Suryaa.co.in

Andhra Pradesh

వెంకటరామిరెడ్డి సంఘ నాయకుడా లేకా వీధి రౌడీనా?

– పెయిడ్ ఆర్టిస్టు , ప్రభుత్వానికి తొతు
– రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గిరి కుమార్ రెడ్డి
కర్నూలు : ఇటీవల సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డి తన ఒంగోలు పర్యటనలో ఇరు జె.ఏ.సి ల నాయకులైన బండి శ్రీనివాసరావు , బొప్పరాజులపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కనీసము సభ్యత సంస్కారం లేకుండా ఒక వీధి రౌడీలా ఒంగోలుకు రండి తేల్చుకుందాము అని మాట్లాడడాన్ని బట్టి చూస్తే అతను సంఘ నాయకుడా లేకా వీధి రౌడీనా అనే సందేహము కలుగుతోందని రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి & కర్నూఓల్ జిల్లా అధ్యక్షులు వి.గిరి కుమార్ రెడ్డి అన్నారు.
వెంకటరామిరెడ్డి కేవలం తనను తాను సంఘ నాయకుడిగా ప్రకటించుకున్న స్వయప్రకఠిత నాయకుడని ఇతనికి కనీస విషయ పరిజ్ఞానం లేదని, ఉద్యోగుల సమస్యల పై ఇతను లైవ్ డిబేట్స్ లో పాల్గొని మాట్లాడుతున్నప్పుడు ఇతని మాటలు చూస్తేనే పసి పిల్లవాడికి కూడా తేలిసిపోతుందని, ఇతను తరచుగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సరిగా గమనిస్తే, ఉద్యోగుల సంక్షేమం కోసం మాట్లాడే ఒక్క మాట కనపడదు. కేవలం ఒక పెయిడ్ ఆర్టిస్టు గాడిలా, ప్రభుత్వానికి ఒక తొతులా మాట్లాడ్డము ఇతని నైజమని, ఇలాంటి వ్యక్తి అత్యంత క్రమశిక్షణ కలిగిన సుదీర్ఘ చరిత్ర ఉన్న సంఘాలకు ప్రజాస్వామ్య పద్దతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నికైన బండి, బొప్పారాజులను విమర్శించడం విడ్డూరమని, ఇప్పటికైనా ఇలాంటి వ్యాక్యస్లు మనుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వి.ఆర్.ఓ ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనం కోసం ఉద్యముస్తున్న నిజాయితీ గలిగిన సంఘ నాయకుడైన బొప్పరాజు ను విమర్శిస్తూ సాక్షి టీవీ లో రెవిన్యూ సంఘం నుండి బహిష్కరింపబడిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దివాకర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్నా దివాకర్ గారు మిమ్మల్ని రెవిన్యూ జె.ఏ.సి నాయకుడిగా నేనే ప్రకిటించాను. అయితే ఇలా ఉద్యమ ద్రోహిగా మారడమే కాకుండా, బొప్పరాజు పై మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చూస్తుంటే ప్రభుత్వమే మీ వెనుక ఉండి మీతో మాట్లాడిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోంది అని దయ చేసి వ్యక్తిగత విమర్శలు మానుకొని ఇప్పటికైనా మేల్కొని తమతో కలసి రావాలని అలాగే ఇరు జె.ఏ.సి లు ప్రకటించించిన కార్యాచరణలో భాగముగా రాష్ట్ర వ్యాప్తముగా తమ వి.ఆర్.ఓ లు పాల్గొంటున్నారని తెలియజేశారు.
వి.ఆర్.ఓ ల రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్(చంటి) మాట్లాడుతూ…ఈ మధ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భూపతిరాజు రవీంద్ర రాజు ఒక పత్రికా సమావేశములో మాట్లాడుతూ ఓపెన్ బ్యాలెట్ లో ప్రజాస్వామ్య బద్దముగా ఎన్నికై కొనసాగుతున్న మమ్ములను మాజీలు అనడాన్నీ తీవ్రముగా వ్యతిరేకిస్తూ ఖబడ్దార్ భూపతి రాజు ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే చెప్పుతో కొట్టి నీకు తగిన గుణపాఠము చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమములో జిల్లాలో నూతనంగా ఏర్పాటైన గ్రామ రెవిన్యూ అధికారుల యాడ్ హాక్ కమిటీ అధ్యక్షులు రాముడు మరియు ప్రధాన కార్యదర్శి సూరి బాబు, కలెక్టరేటు APRSA నాయకులు వెంకట రాజు, మెరునా కుమార్, ధర్మేంద్ర ఫణి, ఇతర నాయకులు మరియు వి.ఆర్.ఓ లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE