మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు..!

497

డిసెంబర్ 14 (మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు) భగవద్గీత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
విశ్వమంతటా విరాట్ పురుషుని సాక్షాత్కరించి కొని సకల వేదాంత సారాన్ని సర్వ మానవ కల్యాణం కొరకు చాటిచెప్పిన జాతి మన భారత జాతి .వేదాలలో పంచమవేదంగా ప్రసిద్ధి చెందినదే మహాభారతం.మహాభారతంలో ఆరవది భీష్మపర్వం లో శ్రీ కృష్ణ పరమాత్మ కురు పాండవ యుద్ధం లో అర్జునుడు తన యొక్క బంధువులను గురువులను మిత్రులను చూచి శోక సంవిగ్న మానసుడై ,కరుణా పూరితమైన హృదయముతో కన్నీళ్ళతో తనయొక్క వ్యాకుల పాటునుచేతకాని వాడిలా ఉండిపోగా …శ్రీకృష్ణ భగవానుడు జాలిపడి అర్జునుడి ని ఆధారంగా చేసుకొని ప్రాణకోటికన్తటికి ఉపదేశించిన తత్వామృతమే భగవద్గీత.ఇది గానం చేయబడినది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి ఈ గ్రంథాన్ని శ్రీమద్భగవద్గీత అంటున్నాం. ఇందులో 701 శ్లోకాలు 18 అధ్యాయాలుగా చెప్పబడినాయి. ఇది అంతయూ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జరిగినందున ఆ పర్వదినాన్ని మనము గీత జయంతి వేడుకలు చేసుకుంటున్నాం.

భగవద్గీత ఎవరికి ?

చాలా సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు మన సమాజానికి చాలా పెద్ద చిక్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. పారాయణాలు నియమనిష్టలతో చేసే ఓర్పు ఓపిక సన్నగిల్లాయి .నమ్మకాలు కూడా తగ్గిపోయాయి. భగవద్గీత ప్రయోజనం దాదాపు శూన్యం అయింది .ఈ సమాజానికి ఆధునిక నాగరికత సంస్కారాలు విలయ తాండవం చేసే కొంతమంది ఇలా అంటారు సర్వ రోగాలకు ఒకే మందా ?అని లోకంలో ఉన్న వాళ్ళందరికీ భగవద్గీత ఒకటే శరణ్యమా ?అదేదో జీవితంలో దెబ్బతిన్న వాళ్లకు ,వ్యాపారాల్లో నష్టాలు పడ్డవారికి ,సంసారం నుండి పారిపొదలచినవాళ్లకి ,అలాంటి ఇతరులకు కావాలి అంటారు గానీ మాకందరికీ అప్పుడే భగవద్గీత ఎందుకండీ….నాకు ఉప్పు కారాలు జీర్ణమవుతాయి ,కళ్ళు బాగానే కనబడతాయి , కాళ్ళు ఇంకా పట్టుకు పోలేదు ,మతిస్థిమితం బాగానే ఉంది వయస్సు ఏదో వస్తుంది కానీ ఈ లోకం లో పుట్టి మేము ఇంకా ఏమి సాధించామని అప్పుడే భగవద్గీత చదవాలి ఇలా ఎన్నో మాటలు మనం వింటుంటాం .మరి భగవద్గీత సన్యాసులకా? ముసలి వారికా? రోగగ్రస్తులకా?అసమర్థులకా ? లేక అందరం చదవచ్చా ?అనే సందేహాలు ఉన్నాయి .ఇంకా కొందరు అంటారు లాభనష్టాల లెక్కలపై జీవించే వారు ఉంటారు భగవద్గీత చదివితే మాకేంటి లాభం ?ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఇంతకన్నా హాస్యాస్పదమైన వి సమాజంలో ఎన్నో మాటలు మనం వింటుంటాం .ఒక మానవాళి కే కాదు ప్రతి ఒక్క ప్రాణికి భగవద్గీత ప్రయోజనం ఉంటుంది.ప్రపంచంలో ఉన్న సకల వేదాంతాలకు మూల సూత్రాలు అన్ని భగవద్గీతలో పొందుపరుచబడి ఉంటే,భారతీయ వేదాంత దర్శన సర్వస్వం భగవద్గీతలో సాక్షాత్కారము ఇస్తుంటే పుట్టిన ప్రతివాడికి సంబంధించిన సమస్యలే భగవద్గీతలో చర్చించబడిన ఉంటే భగవద్గీత అందరికీ కావాలా? అక్కర్లేదా? అనే ప్రశ్నలు ఏంటి ?

ప్రతి జీవికి భగవద్గీత కావాలి ….

భగవద్గీతలో ఉన్న స్పష్టమైన కొన్ని సిద్ధాంతాలు ఎవరికో వేదాంత లకు మాత్రమే కాక సామాన్య మానవుడు జీవితంలో ప్రతి దినం ,పాత ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందిస్తాయి .మహా పురుషులు ,మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే క్లిష్ట సమస్యలు సంభవించినప్పుడు వారు భగవద్గీతను పరిష్కార సాధనంగా తీసుకున్నట్లు కనబడుతుంది .మానవులకు మౌలికమైన సమస్యలు సమానమైనవి కాబట్టి అవి అందరికీ పరిచయమైన వే అయి ఉంటాయి .కనుక భగవద్గీతను అధ్యాయాన్ని అనుసరించి చదివినవారికి ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఎలాంటి సమస్యలనైనా భగవద్గీత ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు .బాహ్య ప్రపంచం గారడీలో పల్టీలు కొడుతున్న మనకు , మనలోపలి ప్రపంచం అందుబాటులోకి రావాలంటే,మన లోపాలు మనకు అర్థం కావాలంటే మనం భగవద్గీతను చదవాలి .ఇందులో చెప్పబడిన సమస్యలు పరిష్కారాలు ఏ మతంలో వారికైనా కావలసినవి కాబట్టి వాటిని అర్థం చేసుకొని ఇంద్రియ నిగ్రహంతో ,మనో నిగ్రహంతో ,ఆత్మ గుణాలతో ,కర్మ యోగం తో జీవనాన్ని సాగిస్తే…..ప్రతివాడు ఆదర్శ ప్రవృత్తిగల మానవుడుగా రూ పొందుతాడు .పరి పూర్ణుడు ఔతాడు సమాజంలో విరాట్పురుషుని సాక్షాత్కరింప చేసుకోగలుగుతాడు .
భగవద్గీత జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని లాల్బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 14న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష యువ గళ గీతార్చన అని నామకరణం చేశారు. 14 సంవత్సరాల వయసు నుంచి, 40 సంవత్సరాల లోపు యువతీ యువకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. యువతలో భగవద్గీత సారాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ పేర్కొంది.

పగుడాకుల బాలస్వామి
ప్రచార సహ ప్రముఖ్,
విశ్వహిందూ పరిషత్
9912975753