Suryaa.co.in

Devotional

దేవుడి దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధన చేయడమనేదే గొప్ప సాంప్రదాయం. హిందువులు నిత్యం ఇంటిలో దీపారాధన చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. మరి ఆ దీపాన్ని వెలిగించడానికి ఏ నూనెను వినియోగిస్తున్నారు.?దీపాన్ని వెలిగించే నూనెలో కూడా తేడా ఉంటుందా? అంటే ఉంటుంది. మన శాస్త్రాలు అలా చెబుతున్నాయి. అనేక రకాల సంకర నూనెలు వచ్చిన ఈ రోజుల్లో నూనె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నూనె నూనెకు తేడా ఉంటుంది. వెలుగులోనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ నూనెలో ఏ నూనెతో వెలిస్తే ఏ ఫలితం వస్తుంది. వివరాలు తెలుసుకోండి మరీ.

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమంటే చాలా ఇష్టం.
మంచి నూనె అంటే నువ్వుల నూనె ఇది మధ్యమం. గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము. పనులు దివ్యంగా జరుగుతాయి.
ఇప్ప నూనెతో దీపాలు వెలిస్తే, ఫలితం అంతం మాత్రంగానే ఉంటుంది. విధిలేని పరిస్థితులలో మాత్రమే ఈ నూనెతో దీపం వెలిగించాలి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు.
దీపాలలో కూడా తేడా ఉంటుంది. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము.

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE