అయోధ్య నుంచి రామేశ్వరానికి అపూర్వమైన తీర్థయాత్ర

– రామభక్తులకు రైల్వే వరం..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నడుపుతున్న ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలులో భక్తులు ఇప్పుడు అయోధ్య, జనక్‌పూర్, సీతామర్హి, వారణాసి, నాసిక్, రామేశ్వరంతో సహా రామాయణానికి చెందిన తీర్థ‌ప్ర‌దేశాల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే 8,000 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణం 18 రోజులు పడుతుంది. ఈ ప్యాకేజీని మరింత లాభదాయకంగా మార్చేది ఏమిటంటే, ఛార్జీని చెల్లించడానికి EMI ద్వారా చెల్లించే వెసులుబాటును రైల్వే శాఖ క‌ల్పించింది. ఒక వ్యక్తికి టిక్కెట్ ధర రూ. 62,370 నుండి మొదలవుతుంది. ఇందులో 3 AC టైర్ ఛార్జీ, హోటళ్లలో రాత్రి బస, భోజనం, బస్సుల్లో తీర్థ‌ప్ర‌దేశాల పర్య‌ట‌న, ప్రయాణ బీమా, గైడ్ సేవలతో సహా కలుపుకొని టూర్ ప్యాకేజీ ఉంటుంది. EMI ద్వారా చెల్లింపు కోసం IRCTC Paytm, Razorpay చెల్లింపు గేట్‌వేలతో స‌మ‌న్వ‌యం చేసుకుంది.

IRCTC ప్రతినిధి మాట్లాడుతూ, “తొలి భారత్ గౌరవ్ రైలు సర్వీస్ ఈ ఏడాది జూన్ 21 నుండి ప్రారంభమవుతుంది. 600 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 11 AC త్రీ టైర్ కోచ్‌లు ఉంటాయి. రైలు మొదటి స్టాప్ అయోధ్య, ఇక్కడ పర్యాటకులు రామజన్మభూమి ఆలయం, హనుమాన్ దేవాలయాన్ని సందర్శిస్తారు. నందిగ్రామ్ వద్ద ఉన్న‌ భారత్ మందిర్. ఆ త‌ర్వాత బక్సర్ లో ఉన్న మహర్షి విశ్వామిత్ర ఆశ్ర‌మం, రామ్ రేఖ ఘాట్ లను భ‌క్తులు సంద‌ర్శిస్తారు. ఆ తర్వాత రైలు జైనగర్ మీదుగా జనక్‌పూర్ (నేపాల్)కి వెళుతుంది. రైలులో సామాను కోసం రెండు అదనపు కోచ్‌లు, తాజాగా వండిన శాఖాహార భోజనం కోసం ఒక ప్యాంట్రీ కారు ఉంటుంది. ఈ రైలులో పర్యాటకుల కోసం ప్రతి కోచ్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ” అని తెలిపారు.

– వీఎస్‌కె తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply