ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా? అంటూ ఫైర్ అయిన పవన్… అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారన్నారకని గుర్తుచేశారు.