పొత్తుల పై జనసేనాని క్లారిటీ..

గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించిన ఆయన.. బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇస్తామంది.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇక, రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్‌ అన్నారు పవన్‌ కల్యాణ్‌.. ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదన్న ఆయన… 2014లో సూటిగా ప్రశ్నించాం.. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం.. 2019లో బలంగా పోరాటం చేశాం.. బరిలో నిలబడి ఉన్నాం.. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ప్రకటించారు.

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాగా పాలిస్తారనే తాను ఎదురుచూశానని, కానీ.. ప్రజాకాంక్షకు వ్యతిరేక పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు పవన్. ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభించిందని ఎద్దేవా చేసిన ఆయన.. వైసీపీ తీసుకొచ్చిన ఇసుక విధానంతో 30 లక్షల మంది రోడ్డునపడ్డారని, 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఇంత విధ్వంసపూరిత ఆలోచనా విధానం ఏంటని పవన్‌ ప్రశ్నించారు.

Leave a Reply