విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం కట్టడంలేదంటూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ ను ముద్దుల మామయ్య అంటూ సంబోధించారు. తనను మామయ్యా అని పిలవాలని అంటుంటారని, ముద్దు పెట్టుకుంటానని చెబుతుంటారని, ఆయన ముద్దుల మామయ్య అని నవ్వులు పూయించారు. ముద్దుల మామయ్య రాష్ట్రాన్ని బాగా చూసుకుంటే తనకంటే సంతోషించేవాళ్లెవరూ ఉండరని పవన్ అన్నారు.
కానీ ముద్దుల మామయ్య ఎక్కువగా విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో సంస్కారం తన నోటిని కట్టిపడేస్తుంటుందని అన్నారు. “మీరు బాగా చదువుకోండి… మీకెందుకు, మీ మామయ్యగా నేనున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు మామయ్య డబ్బులు కట్టడంలేదు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్లు చెల్లించడంలేదు” అంటూ పవన్ పేర్కొన్నారు.
ముద్దుల మామయ్య ఫీజ్ రీఎంబర్స్మెంట్ కట్టట్లేదు – JanaSena Chief Sri @PawanKalyan #JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/W5vEKhjUe0
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2022