ఎప్పటికప్పుడు ప్రత్యేక జానర్స్‌లో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్వక్సేన్ కొత్త సినిమా పట్టలెక్కింది. కన్నడ స్టార్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా
Power Star #PawanKalyan graced #VishwakSen – #Arjun film Muhurtham & Pooja Ceremony
Mass Ka Dass @VishwakSenActor, @aishwaryaarjun starrer in @akarjunofficial direction launched today@srfioffl @IamJagguBhai @RaviBasrur #VishwakSen11 pic.twitter.com/hYBR0TtbpY
— Telugu FilmNagar (@telugufilmnagar) June 23, 2022
మొదలైంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన హీరో విష్వక్సేన్, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పై క్లాప్ కొట్టారు.
అర్జున్ తో పవన్ కు మంచి స్నేహం ఉంది. దాంతో, అర్జున్ నుంచి ఆహ్వానం అందగానే పవన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్- పవన్ ఆప్యాయంగా పలకరించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విష్వక్సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని జోరు మీదున్నాడు. దాంతో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ తో చేస్తున్న తాజా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది వరకు పలు చిత్రాలను తెరకెక్కించిన అర్జున్ చాలా రోజుల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. పైగా, ఈ చిత్రానికి ఆయనే కథా రచయిత, నిర్మాత. హీరోయిన్ ఐశ్వర్య ఆయన కూతురే కావడం కావడం మరో విశేషం.
ఈ చిత్రంతో ఐశ్వర్య టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు.
Power Star @PawanKalyan with his friend @akarjunofficial at the Muhurtham Ceremony of Arjun’s directorial venture starring @VishwakSenActor & @aishwaryaarjun.
@IamJagguBhai @RaviBasrur#VishwakSen11 @srfioffl pic.twitter.com/uqNhuwG5fl
— Telugu FilmNagar (@telugufilmnagar) June 23, 2022