Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి సభల్లో మహిళలపై దుశ్శాసనపర్వం

• నరసాపురంసభలో మహిళలు, యువతుల చున్నీలు తీయించి, వారికి తీరని అవమానం, ఆవేదన మిగిల్చిన వారిపై జగన్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలి
• సొంతతల్లి, చెల్లే జగన్ రెడ్డిని నమ్మకపోతే, ప్రజలు నమ్ముతారా?
• ముఖ్యమంత్రికి అభత్రతాభావం ఎక్కువైంది కాబట్టే, నన్నునమ్మండి..నా ప్రభుత్వాన్ని నమ్మండి అంటున్నారు
• పీతల సుజాత

తనను, తనప్రభుత్వాన్ని నమ్మండని ముఖ్యమంత్రి నరసాపురంలో మొత్తుకోవడం చూస్తే, ఆయనలో అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, వైసీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందికాబట్టే, రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై 52వేలకు పైగా నేరాలుఘోరాలు జరిగాయని మాజీమంత్రి శ్రీమతి పీతలసుజాత పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడిన వివరాలు… క్లుప్తంగా మీకోసం…!

“జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళల్ని పూచికపుల్లల్లా తీసిపడేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్, చంద్రబాబు హాయాంలో మహిళలు ఆత్మగౌరవంతో, తలెత్తుకొని జీవించడమేకాక, అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రజలఖర్మకొద్దీ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిన జగన్ రెడ్డి హయాంలో ఏపీ మహిళలపై 52వేలకు పైగా నేరాలు ఘోరాలు జరిగాయని ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ) నివేదికతో తేలిపోయింది.

ఎన్సీ ఆర్ బీ నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. తల్లులపెంపకం సరిగాలేదని, యాథృచ్ఛికంగా రేప్ లు జరుగుతాయని మంత్రులు వ్యాఖ్యానించడం ఆడబిడ్డల్ని అవమానించడంకాదా? రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని దారుణా లు జరుగుతుంటే దిశాచట్టం ఏమైంది? మహిళల్ని వేధించినా, వారినేం చేసినా ముఖ్యమంత్రి కాపాడతారన్ననమ్మకం, ధైర్యంతోనే కామాంధులు పేట్రేగిపోతున్నారు.మహిళలు, వారి భద్రత విషయంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యమే, వారిపాలిట శాపంగా మారింది.

ముఖ్యమంత్రి నరసాపురంసభలో ఆడబిడ్డల చున్నీలు తీసేయించడం వారిని అవమానించడం కాదా? మహిళల చున్నీలు లాగిన పోలీసులు, ఇతరులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ఇళ్లల్లో మహిళలబట్టలు అలానేలాగితే ఊరుకుం టారా? జగన్ రెడ్డిసభకు ఎందుకొచ్చామా అని మహిళలు, యువతులు సిగ్గుతో చచ్చి పోయారు. గతంలోకూడా పోలీస్ శాఖలోని ఖాళీల రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా అభ్యర్థులకు పురుషులతో కొలతలుతీయించారు. అప్పుడు తాముసమస్యను బయట పెట్టినా కూడా ముఖ్యమంత్రి, ప్రభుత్వంస్పందించలేదు. ఎంపీడీవో సరళాదేవిని, వైద్యురాలు అనితారాణిని కూడా సిగ్గుశరంలేకుండా వైసీపీనేతలు అవమానించారు.

వైసీపీప్రభుత్వ కుట్రపూరిత చట్టాలవల్లే ఆక్వారంగం నిర్వీర్యం…
ఆక్వారంగం కుదేలవడానికి జగన్ రెడ్డి అవినీతి, అస్తవ్యస్త విధానాలే కారణం. ఆక్వారంగం గురించిగానీ, హేచరీస్, ఆక్వాఉత్పత్తుల ఎగుమతులతోగానీ ప్రభుత్వానికేం పని? సినిమాటిక్కెట్ల మాదిరే ఆక్వాఉత్పత్తులను కూడా ఆదాయవనరుగా మార్చుకొని ఆక్వారైతుల్ని రోడ్డునపడేయాలన్నదే పాలకుల ఉద్దేశమా? గిట్టుబాటుధర లభించక, ధాన్యంరైతులు నానా అవస్థలు పడుతున్నా వారిగోడు వినే నాథుడు లేకుండా పోయాడు.

మాప్రభుత్వాన్నే నమ్మండని జగన్ రెడ్డి మొత్తుకుంటున్నారంటే, ఆయనకు అభద్రతా భావం ఎక్కువైందని స్పష్టమవుతోంది. సొంతతల్లి, చెల్లే ఆయన్ని నమ్మకపోతే, ప్రజలు ఎలా నమ్ముతారు? వివేకాహత్యకేసు విచారణను వేరేరాష్ట్రానికి బదిలీచేయమని జగన్ రెడ్డి సొంతచెల్లి సునీత కోరిందంటే, ఆయనపై నమ్మకంలేకే కదా? జగన్ రెడ్డి చెప్పిందొకటి.. చేస్తున్నదొకటని ప్రజలకు అర్థమైంది. ఇంకెంతకాలం ఈ ఖర్మ (జగన్ రెడ్డిని) భరించాలని ప్రజలంతా బోరుమంటున్నారు. జగన్ రెడ్డికి ఓటేసిన పాపానికి మహిళలు అవమానాలు భరిస్తూ, భయంతో ఛస్తూ బతకాలా? రాష్ట్రాన్ని దుశ్వాసనపర్వంగా మార్చిన జగన్ రెడ్డి, ఇప్పటికైనా తనతీరు మార్చుకోవాలి. జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన నేరాలు-ఘోరాలపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని సుజాత డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE