(పెళ్ళికానుక విడుదలై అరవై రెండేళ్లు)
నాయకుడు..
ఇద్దరు నాయికలు..
ఒకరితో ప్రేమ…
ఇంకొకరితో పెళ్లి..
ఇక్కడ సరాగం..
అక్కడ విరాగం..
ప్రియురాలి జ్ఞాపకాలతో
ఇల్లాలికి దూరం..
రెండు పేధస్ పాటల భారం..
ఇదే ఎన్నో సినిమాల ఇతివృత్తం..
హిట్లు కొట్టేసిన వృత్తాంతం!
పెళ్ళికానుక..
అదే వాడుక..
ఆ వాడుక మరచి
హీరోని వేడుక చేసిన నాయిక..చక్కని గీతమాలిక!
కొమ్మలు విరిగిన..
ఆకులు రాలిన చెట్టు..
ఆక్కడో పేథాస్సు..
అంతకు ముందు పచ్చని చెట్ల కింద హీరోయిన్ తో
చెట్టాపట్టా..
ఇలాంటి గీతాలకు స్పెషలిస్టు
మన అక్కినేని..
అలాగే సరోజాదేవితో
డ్యూయెట్టు..
కృష్ణకుమారితో పెళ్లి..
అప్పుడే కథ రసపట్టు..
ఆడేపాడే పసివాడితో
రెండు పాటలూ
సూపర్ హిట్టు..!
ఇంతలో కథలో మలుపు..
తెలిసి పతిదేవుని
పాత వలపు..
తప్పుకోవాలని తలపు..
ఈలోగా పై నుంచి పిలుపు..
ఎదురుచూడని ముగింపు..!
ఎ ఎం రాజా స్వీయ సంగీతం
ప్రతి పాట పులకింపజేసే
సుప్రభాతం..
తీరెనుగా నేటితో
నీ తీయని గాథ..
ఆడే పాడే పసివాడా..
ఈ రెండు పాటలూ రెండుసార్లు..
ఈ పాటలన్నీ ఎ ఎం రాజా
స్వరకల్పనలో వింటే..
పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు..
మనసునే మరిపించు..
జిక్కి..సుశీల..రాజా స్వరాలు
మదిని మురిపించు..!
విషాదాన్ని మరపించిన
రేలంగి..గిరిజ హాస్యం..
గుమ్మడి..జగ్గయ్య సామరస్యం..
అమ్మ దూరమైన పసివాడికి
పిన్నే అమ్మ..
ఫలించని ప్రణయం..
చివరకు అక్కినేనికి
డ్యూయెట్టు పోయి
బల్లెట్టుపై పయనం..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286