Suryaa.co.in

Telangana

పెండింగ్ ఫీజులు త్వరలో చెల్లిస్తాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్, టెక్నికల్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా, త్వరలో చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రైవేట్ కళాశాలల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు కలిపి ఏడాదికి 66 వేల కోట్లు, రైతు రుణమాఫీ ద్వారా 21 వేల కోట్లు మొత్తం ఏడాది ఈ రెండు అంశాలకే 87 వేల కోట్ల నగదును చెల్లించామని వివరించారు. ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, అసెంబ్లీ సమావేశాల తదుపరి బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిల చెల్లింపు అని వార్యమని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దశలవారీగా చోటుచేసుకున్న చెల్లించాలని నిర్ణయించినట్లు యజమానులకు తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE