-మానవీయ కోణంలో అనేక మంది బాధితులు, దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు
-పెన్షన్ దారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-పెన్షన్ లబ్ధిదారుల తో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి
-జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం మంత్రి క్యాంపు -కార్యాలయం లో లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ లను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి, జనగామ జిల్లా సెప్టెంబర్ 1 : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవని ఇది తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి కొత్త ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్లు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చే నాటికి 20 లక్షలు గా ఉన్న పెన్షన్ల సంఖ్యను తెలంగాణ వచ్చాక 40 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు. తాజాగా 65 సంవత్సరాల వయసు నుండి 57 సంవత్సరాలకు కుదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు ఈ మొత్తం సంఖ్య యాభై లక్షల దరిదాపులకు చేరిందని మంత్రి అన్నారు.
కేంద్రం 200 కోట్లు మాత్రమే ఇస్తూ ఆరు లక్షల మందికి పెన్షన్లు అందజేస్తుందని, అదే తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల మందికి ఏడాదికి 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలకు మించని పెన్షన్ ని రెండుసార్లు పెంచి వృద్ధులకు ఇతరులకు 2016 దివ్యాంగులకు 3016 రూపాయలు ఇస్తున్నామన్నారు. బిజెపి పాలిత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 100 నుంచి 500కు మించడం లేదని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో వినూత్నంగా రూపొందించి అమలు చేస్తున్న అన్ని పథకాలకు మానవీయకోణాన్ని జత చేశారని అందులో భాగంగా పెన్షన్ దారులకు గతంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా పెన్షన్లు అందజేస్తున్నారని అన్నారు. కేంద్రం మరియు ఇతర రాష్ట్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుండగా మన రాష్ట్రంలో మాత్రమే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, పైలేరియా బాధితులు తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, మ్యానిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి సీఎం కేసీఆర్. అని మంత్రి తెలిపారు. టీఆరెస్ పథకాలను కాఫీ కొట్టిన పార్టీ బిజెపి పార్టీ అని, లేని గొప్పలు చెప్పుకుంటూ, బీజేపీ దాంబికాలు కొడుతున్నదని మంత్రి ఎద్దేవా చేశారు.
జనగామ జిల్లా లో గతంలో మంజూరైన పెన్షన్లు 64,515, ప్రస్తుతం కొత్తగా మంజూరైన పెన్షన్లు 18,522, మొత్తం 83,037 పెన్షన్లు
పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో మంజూరైన పెన్షన్లు 33,720, ప్రస్తుతం కొత్తగా మంజూరైన పెన్షన్లు 11,250, మొత్తం 44,970 పెన్షన్లు.
పాలకుర్తి మండలంలో గతంలో మంజూరైన పెన్షన్లు 6,810, ప్రస్తుతం కొత్తగా మంజూరైన పెన్షన్లు 2,096, మొత్తం 8,906 పెన్షన్లు.
పాలకుర్తి గ్రామంలో గతంలో మంజూరైన పెన్షన్లు 822, ప్రస్తుతం కొత్తగా మంజూరైన పెన్షన్లు 197, మొత్తం 1019 పెన్షన్లు మంజూరు అయినట్లు మంత్రి వివరించారు.
అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ శివ లింగయ్య లు కొత్త పెన్షన్ లబ్ధి దారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.