– ట్విట్టర్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో నిన్న జరిగిన రెండు ఘటనలు ప్రభుత్వ దుర్మార్గాన్ని చాటి చెపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ ఉద్యోగి వాసుదేవరావుపై సర్పంచ్ భర్త గున్నయ్య దాడిచేశారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించారని కవిత అనే మహిళ ఇంటికి కరెంట్ తొలగించి పాలు, నీళ్లు కూడా అందకుండా చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఉద్యోగులు, ప్రజల పట్ల వైసిపి గూండాలు వ్యవహరించిన తీరు ఒకటైతే…దాన్ని సమర్థించిన ప్రభుత్వం తీరు మరింత విస్తుగొలుపుతుంది. పోయేకాలం దాపురించి కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్న వైసిపి రాక్షసులు వీటన్నింటికీ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గున్న ప్రభుత్వం అయితే శ్రీకాకుళంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళపై వేధింపులకు తలదించుకోవాలి. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలి. బాధితులను క్షమాపణ కోరాలి. ప్రజలు మీ ప్రభుత్వ ప్రతి వికృత పోకడను గమనిస్తున్నారనేది తెలుసుకోవాలి.