Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని ని ఉత్తరాంధ్ర ప్రజలు‌ కోరుకోవడం లేదు

-అధికారపక్షంపై ఉన్న ఓట్లు చీలకూడదన్న అభిప్రాయంతో ఓటర్లు కూడా ఉన్నారు
– మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు

గుంటూరులో ఓ పంక్షన్ కు రావడం జరిగింది. గుంటూరు ఎప్పుడు వచ్చినా మా మిత్రులు కన్నా లక్ష్మీనారాయణను‌ మర్యాదపూర్వకంగా కలుస్తా ఉంటా. ఉత్తరాంధ్ర రాజధానిపై ఆల్ రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో యువత తీర్పు ఇచ్చారు.ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి చిరంజీవి గెలిచారు.రాజధాని ని ఉత్తరాంధ్ర ప్రజలు‌ కోరుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వెండి కాయిన్లు, రెండు వేల నోటు ఇచ్చిన ప్రజలు ఓటు వేయలేదు.అధికారపక్షంపై ఉన్న ఓట్లు చీలకూడదన్న అభిప్రాయంతో ఓటర్లు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు.

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు: తెనాలిలో టిడిపి కౌన్సిలర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం.ఇవాళ అనంతపురం జిల్లా మాజీ మంత్రి పల్లెరఘునాథ్ మీద దాడికి పాల్పడ్డారు.జగన్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం పెంచిపోషిస్తున్నారు.జగన్ మాట విని దాడులు చేసే వారు గుర్తుపెట్టుకోవాలి, రేపు అధికారం మారితే మూల్యం చెల్లించుకోవాలి.ఇటీవల జరిగిన ఎన్నికలలో మూడు ప్రాంతాలలో వైసిపి ఓటమి పాలైంది.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ : ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న టెంట్ వద్ద నిన్న దాడి జరిగింది. అమరావతిలో మూడు రాజధానుల నిరసన కారులు లేరు. ప్రభుత్వమే మూడు రాజధానుల టెంట్ ఏర్పాటు చేసి నడిపిస్తోంది.

LEAVE A RESPONSE