Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి

– చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై చంద్రబాబు ఆవేదన

వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా…వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది.

భర్త లేకపోయినా…దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యం అయిన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.

LEAVE A RESPONSE