Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తలే చంద్రబాబుకి కొండంత బలం

• సైకిల్ యాత్ర చేసిన వారిని అభినందించిన భువనమ్మ
• వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
• చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23రోజులు సైకిల్ యాత్ర చేసిన యువతకు హెల్మెట్ అందించిన భువనమ్మ

ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ…. చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందనీయం.. మిమ్మల్ని బాబుగారి నుండి ఎవరూ వేరు చేయలేరు. మీ సహకారంతోనే బాబుగారు అనేక కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి చేయగలిగారు. టీడీపీ కార్యకర్తలే చంద్రబాబుగారికి కొండంత బలం, ధైర్యం.

బాబుగారు ఇంకా మీకోసం, మీ భవిష్యత్తుకోసం చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. మాకు, బాబుగారికి పదవులపై ఆశ లేదు.యువత భవిష్యత్తును నిలబెట్టాలనేదే బాబుగారి ఆశ. మీ కోసం రాబోయే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకునే బాధ్యత యువతపైనే ఉంది. యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంది..పోరాడి అయినా యువత ఎన్నికల్లో నిజాయితీగా ఓట్లు జరిగేలా చూడాలి.

ఎన్నికల బూత్ లో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ద్విచక్ర వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి.. అలాగే హెల్మెట్ కి ఉన్న క్లిప్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. యువత దేశానికి చాలా అవసరం… దేశం కోసం యువత నిలబడాలి. ప్రాణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

LEAVE A RESPONSE