– మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, జి.వివేక్, జితేందర్ రెడ్డి
హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు టీఆర్ఎస్ కు కనువిప్పు కావాలి. బర్తరఫ్ చేసినా, అణిచివేసినా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వదిలి వెళ్లలేరని సీఎం కేసీఆర్ అనుకున్నడు. సీఎంను నిలదీసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. టీఆర్ఎస్ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా, ప్రభుత్వ పథకాల పేరుతో రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు టీఆర్ఎస్ కు చెంప దెబ్బ కొట్టారు.ఈటల రాజేందర్ ఇంత పెద్ద మెజారిటీతో గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. టీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రజలంతా భావిస్తున్నరు. కేసీఆర్ నియంత, కుటుంబ, అవినీతి పాలనకు హుజూరాబాద్ ప్రజలు చెంపదెబ్బ కొట్టిండ్రు. పైసలిస్తే గెలుస్తామని భావించిన టీఆర్ఎస్ నేతలు ఊహించని రీతిలో బీజేపీకి ఓటేసి ఈటల రాజేందర్ ను గెలిపించిండ్రు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపుతో త్వరలో మధ్యంతర ఎన్నికల రావడం ఖాయం.
ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా ఈటల రాజేందర్ ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు నా సెల్యూట్. ఒకనాడు కేసీఆర్ కారులో పెట్రోలు లేకపోతే పోయించి టీఆర్ఎస్ పార్టీని నడిపిన నాయకుడు ఈటల రాజేందర్. ధర్మం పాటిస్తూ కల్లాకపటం ఎరగని నేత, బీజేపీ వల్లే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా గల్లంతైంది. బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ ఆధ్వర్యంలో, హుజూరాబాద్ లో బీజేపీ గెలుపుతో 2023లో గొల్లకొండపై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం.