కేసీఆర్ చెంప పగలకొట్టేలా తీర్పు

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి
కేసీఆర్ చెంప పగలకొట్టేలా తీర్పు ఇచ్చిన హుజూరాబాద్ ప్రజలకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు. హుజూరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం లేచింది. డబ్బు ప్రలోభాలను హుజూరాబాద్ ప్రజలు చెప్పుతో తొక్కిపడేశారు. హుజూరాబాద్ ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని నిరూపించారు. కేసీఆర్ ఇకనైనా బుద్ది తెచ్చుకోండి. మారండి. ఉద్యమాలతోనే సీఎం అయిన మీరు డబ్బుతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. ఉద్యమాల ద్వారానే బీజేపీ అధికారంలోకి రాగలుగుతుందనే సంకేతాలను హుజూరాబాద్ ప్రజలు తమ తీర్పుద్వారా పంపారు. ప్రజా సమస్యలపై పోరాడితే తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటారనే దానికి నిదర్శనమే హుజూరాబాద్ ప్రజల తీర్పు.
బీజేపీ నేతలంతా టీం వర్క్ గా పనిచేయడంవల్లే హుజూరాబాద్ లో కమలం గెలిచింది. కేసీఆర్….మీరు కోమా సీఎం. ఇంకా మీ పాలనకు రెండేళ్ల సమయముంది. ఇకనైనా మారి ప్రజలకు మంచి చేయండి. కేసీఆర్….మీలో భయం ఉంది. తప్పు చేశానని భావించారు కాబట్టే… హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రాలేదు…..మీకు డబ్బు అనే జబ్బు పట్టుకుంది. మీకు ఇకనైనా జ్ఝానోదయం రావాలి. 2023లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం.
కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోవడం ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధం. ఒకవేళ కాంగ్రెస్ ను గెలిపించినా….టీఆర్ఎస్ లో కలుస్తారని ప్రజలకు అర్ధమై ఆ రెండు పార్టీల చెంప చెళ్లుమన్పించారు.