– హడలిపోయిన ప్రేక్షకులు
– రంగంలోకి పోలీసులు
– డమ్మీదేనని తేల్చిన పిఠాపురం పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో RRR సినిమా రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ ధియేటర్ వద్ద ఒక వ్యక్తి పిస్టల్ తో హల్చల్ చేసినట్లు, గాలిలో కాల్పులు జరిపుతూ ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసినట్లు ఒక ప్రముఖ టి.వి ఛానల్ లో వార్తలు భయాందోళనకు గురిచేశాయి.
సదరు విషయమై కాకినాడ SDPO భీమారావు ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ SI శంకర్ మరియు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని డమ్మీ పిస్టల్ తో హల్చల్ చేసిన వ్యక్తి (మారోజు వైకుంఠ బాలాజీ S/o వెంకటరమణ మూర్తి వ/33, కోటగుమ్మం సెంటర్, పిఠాపురం) ని అదుపులోనికి తీసుకుని విచారించగా , సదరు పిస్టల్ డమ్మీ పిస్టల్ తిరునాళ్ళలో బుడగలు కొట్టే పిస్టల్ అని ప్రాథమిక విచారణలో తేలింది. సదరు వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ సంఘటన విషయమై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ థియేటర్లకు వచ్చే యువత చిత్ర ప్రదర్శన సమయంలో హద్దు మీరి ప్రవర్తించిన, ఆకతాయి చేష్టలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.