– టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్. రాజు
రాష్ట్రంలో గత 4 ఏళ్ల నుండి దళితులపై జరుగుతున్న దమనకాండపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమీషన్ డైరెక్టర్ సునీల్ బాబుకు హైదరాబాద్ లోని ప్రాంతీయ కార్యాలయంలో వినతి పత్రం అందించడం జరిగింది. జగన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి దళితులు అట్టడుగు స్థాయికి చేరుకున్నారు. దళితులపై జరిగిన 257 సంఘటనలు, వివరాల డేటాను డైరెక్టర్ కు ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా రాష్ట్రంలో దళితులు బ్రతకలేని పరిస్థితికి దిగజారిపోయిందని వివరించడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే దళిత ద్రోహిగా మారారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయని తెలియజేయడం జరిగింది.
ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై డీజీపీతో సమీక్ష నిర్వహించమని కోరడం జరిగింది.
డైరెక్టర్ మాట్లాడుతూ…. దళితులు పడుతున్న కష్టాలపై సానుకూలంగా స్పందించారు. పులివెందులలో చనిపోయిన జంధ్యాల కృష్ణయ్య కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వచ్చే పరిహారాన్ని కలెక్టర్ తో మాట్లాడి త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. అంతే కాకుండా దళితులపై జరుగుతన్న దమనకాండకు డీజీపీకి లేఖ రాస్తానని చెప్పారు.