-అంతిమయాత్రలో టీయూడబ్ల్యూజే నాయకులు
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు, ఐజేయూ సీనియర్ నాయకులు అంబటి ఆంజనేయులు అంత్యక్రియలు ఇవ్వాళ సాయంత్రం విజయవాడలో జరిగాయి. అంత్యక్రియల్లో ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొని నివాళి అర్పించారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.