Suryaa.co.in

Telangana

తక్షణమే పిఎఫ్‌ఐ ని నిషేధించాలి: విహెచ్‌పి

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని పణంగా పెట్టవద్దు
దాండియా నృత్యాలలో ఇతర మతస్తులను బౌన్సర్లుగా నియమించుకుంటే దాడులు నిర్వహిస్తాం: బజరంగ్దళ్
ప్రతి యువతి లవ్ జిహాద్ పైన అవగాహన ఉండాలి: దుర్గా వాహిని
వినాయక చవితి ఉత్సవాలలో కూడా హిందూ అమ్మాయిలపై వేధింపులు జరిగాయి..!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ బయట పెట్టడం హర్షించదగ్గ విషయం అని విశ్వ హిందూ పరిషత్ కొనియాడింది. విహెచ్‌పి స్టేట్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు, కార్యదర్శి పండరినాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలను ప్రథమ పౌరులుగా భావిస్తూ.. హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పిఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా.. వాటి మూలాలు హైదరాబాద్ లో బయట పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంతుష్టీకరణలో భాగంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. దీని ద్వారా ఒక హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దాండియాలో ఇతర మతస్తులను అనుమతించవద్దు: దుర్గావాహిని
దసరా శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా నిర్వహించే దాండియా నృత్యాలలో అన్యమతస్తుల ప్రవేశాన్ని గమనించాలని తెలంగాణ రాష్ట్ర దుర్గా వాహిని కన్వీనర్ వాణీ సక్కుబాయి అన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలయిన దాండియా వంటి వేడుకల్లో హిందూ యువకుల రూపంలో అన్యమతానికి చెందిన యువకులు వచ్చి హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో వలలో వేసుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. దాండియా వేడుకల నిర్వాహకులు రక్షణ వ్యవస్థల్లో కేవలం హిందూ యువకులు మాత్రమే ఉండేలా చూడాలని.. సహాయం కోసం బజరంగ్ దల్ రక్షణగా ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల గుర్తింపు కార్డులను చూసి లోనికి అనుమతించాలని సూచించారు.

పిఎఫ్ఐ గురించి హెచ్చరించినా పట్టించుకోవడం లేదు: బజరంగ్దళ్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఆగడాల పట్ల ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దల్ కన్వీనర్ శివ రాములు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించి, పిఎఫ్‌ఐ కి చెందిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు.

పి ఎఫ్ ఐ మూలాలను వెలికి తీసి వారిని అంతం చేయాలని శివరాములు డిమాండ్ తమిళనాడు బీహార్ కేరళ రాష్ట్రాలలో నిన్ననే హిందూ నాయకులపై దాడులు చేసి ఓ హిందూ యువకుడిని పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే హిందూ నాయకుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు విసిరి భయభ్రాంతులకు సృష్టిస్తున్నారని ఆందోళన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి హిందువులను చిన్నచూపు చూస్తే బజరంగ్దళ్ చూస్తూ ఊరుకోదని ఈ దేశాన్ని కాపాడుకునే శక్తి బజరంగ్దళ్ కు తమ స్వార్థ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని పణంగా పెడితే తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా స్పందించారు.

దాండియా నృత్యాలలో ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసి బౌన్సర్లను ఉంచుకోవాలన్నారు. ఎక్కడైనా రక్షణ కావాలంటే బజరంగ్దళ్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాలలో కూడా హిందూ యువతులను టార్గెట్ చేస్తూ ముస్లింలు టీజింగ్ చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. లవ్ జిహాదులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వి హెచ్ పి నాయకులు రజినీకాంత్, రేగు అనిల్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE