•విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వలేని జగన్, బదులుగా గంజాయి, మాదకద్రవ్యాలు అందిస్తూ, విద్యారంగాన్ని, భావితరాల భవిష్యత్ ను సర్వనాశనం చేశాడు
• జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని ఉద్ధరిస్తే, చంద్రబాబు హయాంలో ఫీజురీయింబర్స్ మెంట్ తీసుకున్న విద్యార్థుల సంఖ్య 16లక్షలుంటే, ఇప్పుడు 11లక్షలకు ఎందుకు పడిపోయింది?
• వసతిదీవెన, విద్యాదీవెన కింద 4ఏళ్లలో జగన్ విద్యార్థులకు రూ.4,800కోట్లు ఎగ్గొట్టాడు
• గతప్రభుత్వ బకాయిల్ని తనప్రభుత్వం చెల్లిస్తోందన్న ముఖ్యమంత్రి మాటలు పచ్చిఅబద్ధాలు
• బకాయిలన్నీ వైసీపీప్రభుత్వం సక్రమంగా చెల్లిస్తే, రూ.450కోట్లకోసం విద్యాసంస్థల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఎందుకుఆశ్రయించామో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి
• ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని తల్లులఖాతాల్లో వేయడంవల్ల, 40శాతం మంది తల్లులు కళాశాలలకు ఫీజులుచెల్లించడం లేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏం చెబుతుంది?
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
మాయమాటలు, మోసాలు తప్ప జగన్మోహన్ రెడ్డికి మరోటి తెలియదని, అన్నివర్గాల అభ్యు న్నతికి అత్యంతకీలకమైన విద్యారంగాన్ని ముఖ్యమంత్రి సర్వనాశనం చేశాడని, నాడు-నేడు అంటూ ఆర్భాటంగా కబుర్లుచెప్పిన వ్యక్తి, విద్యా ర్థులు, యువతకు విద్యను దూరంచేశాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
4ఏళ్లలో ప్రాథమిక విద్యకు పంగనామాలుపెట్టిన జగన్, జీవోనెం-77తో ఉన్నతవిద్యకు మంగళం పాడి, దళిత, బీసీవిద్యార్థుల నోట్లో మట్టికొట్టాడు
“వైసీపీ ప్రభుత్వంలో బడుగు బలహీనవర్గాలు, దళితులకు విద్య అందని పండే అయ్యింది. ముఖ్యమంత్రి మాటలతో మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప, ఆచరణలో పేదలకు విద్యను అందించేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. చంద్రబాబు పేదలకుప్రాథమిక విద్య ను అందించడానికి పాఠశాలలు నెలకొల్పితే, వాటిని జగన్ మూసేశాడు. ప్రాథమిక విద్యకు పంగనామాలు పెట్టిన జగన్, జీవోనెం-77తో ఉన్నతవిద్యకు మంగళం పాడి, అంతిమంగా దళిత, బీసీవిద్యార్థుల నోట్లో మట్టికొట్టాడు. చంద్రబాబు విద్యఆవశ్యకతను గుర్తించి, ప్రాథమిక విద్యదశ నుంచే విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందించాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఇబ్బందిలేకుండా అందించిన ఘనత టీడీపీప్రభుత్వా నిదే. 16లక్షలమంది విద్యార్థులకు చంద్రబాబు ఒకేసారి ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంఖ్యను 11లక్షలకు కుదించాడు. విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోపాటు, ఫీజురీయింబర్స్ మెంట్ ను వైసీపీప్రభుత్వం 4విడతలుగా అందిస్తూ వి ద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చింది. విద్యార్థులకుప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా సక్రమంగా ఒకేసారి ఇవ్వలేని ముఖ్యమంత్రి విద్యారంగాన్ని ఉద్ధరించానని చెప్పుకోవ డం సిగ్గుచేటు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సంవత్సరంలో 4సార్లు ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తూ, విద్యాదీ వెన పథకం పేరుతో వందలకోట్లు వెచ్చించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప ముఖ్య మంత్రి విద్యార్థులకు ఒరగబెట్టింది ఏమిలేదు. విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి అంటూ పత్రికల్లో ప్రకటనలకు వెచ్చిస్తున్న సొమ్మునే జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తే వారు సంతో షంగా చదువుకుంటారు కదా! చంద్రబాబుగారు 16లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తే, జగన్ వచ్చాక విద్యార్థుల సంఖ్య 11లక్షలకు ఎందుకు చేరింది? జగన్ అతనిప్రభుత్వం మేలైన విద్యావి ధానం అమలుచేస్తే చదువుకునేవారి సంఖ్యపెరగాలి గానీ తగ్గడమేంటి?
వసతి దీవెన, విద్యాదీవెన కింద 4ఏళ్లలో జగన్ విద్యార్థులకు రూ.4,800కోట్లు ఎగ్గొట్టాడు
ఏటా ఫీజురీయింబర్స్ మెంట్ ను 4 విడతల్లో చెల్లించిన ప్రభుత్వం 2023లో కేవలం ఒకసారి మాత్రమే చెల్లించింది. 8సార్లు చెల్లించాల్సిన వసతిదీవెన సొమ్మునికూడా 4సార్లు మాత్రమే చెల్లించి చేతులుదులుపుకున్నారు. 2021లో జగన్ ఒకవిడత ఫీజురీయింబర్స్ మెంట్ నిధు లు ఇవ్వలేదు. అలానే 2022లో కూడా 3 విడతలసొమ్ము ఎగ్గొట్టాడు. ప్రతిసారి రూ.600కోట్ల చొప్పున 4 విడతల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ము రూ.2,400కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో జగన్మోహన్ రెడ్డి సమాధానంచెప్పాలి. సంవత్సరానికి 8విడతలుగా చెల్లిస్తున్న వసతిదీవెన పథకం సొమ్మునికూడా జగన్ సక్ర మంగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించిందిలేదు. ఇప్పటివరకు కేవలం 4విడతల సొ మ్ముమాత్రమే చెల్లించాడు. వసతిదీవెన కిందకూడా జగన్మో హన్ రెడ్డి 4 విడతలసొమ్ము ఎగ్గొట్టి, రూ.2,400కోట్లవరకు ఎగనామం పెట్టాడు
పత్రికాప్రకటనల్లో ప్రతిసారి గతప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టింది, తాము చెల్లిస్తున్నాం అనిచెప్పే జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం ఇప్పుడు బకాయిలకోసం రోడ్డె క్కిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఏంసమాధానంచెబుతుంది? గతప్రభుత్వంపై నింద లేస్తున్న జగన్ రెడ్డి, విద్యాసంస్థలకు రూ.450కోట్లు ఎందుకుబకాయిలు పెట్టాడో సమాధా నం చెప్పాలి. బకాయిలకోసం కోర్టుల్ని ఆశ్రయించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఏం సమాధానం చెబుతాడు? ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు బకాయిలు చెల్లించాలని కోర్టులిచ్చిన ఆదేశాలను జగన్ ప్రభుత్వం ధిక్కరించలేదా?
కోర్టుల్ని ధిక్కరించిందికాక, యాజమాన్యాలను బెదిరించడం విద్యార్థులజీవితాలతో ఆటలాడటంకాదా? దారికిరాని విద్యాసంస్థల యాజమాన్యాలపై అధికారులతో దాడులుచేయించడం, తప్పుడుకేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల జీవితాల పై ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం సక్రమంగా డబ్బులు చెల్లించకపోతే, అంతిమంగా నష్టపోయేది విద్యార్థులేననే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వా నికి లేకపోవడం బాధాకరం.
జీవో-77 వల్లే పీజీ చదివే విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది అంటున్న గణాంకాలపై ముఖ్యమంత్రి సమాధానమేంటి?
దక్షిణభారతదేశంలో మరీముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పీజీచదివే విద్యార్థులసంఖ్య గణనీయం గా తగ్గిపోయిందంటున్న గణాంకాలపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతారు? జగన్ ప్రభు త్వం ఉన్నతచదువులు చదివే బీసీవిద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా జీవో నెం-77 తీసుకొచ్చింది. యూనివర్శిటీల్లో చదివే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు మాత్రమే ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తామన్న ప్రభుత్వ జీవో, ఉన్నతచదువులు చదవాలన్న యువత ఆశలపై నీళ్లుచల్లిందనే చెప్పాలి. అన్నివర్గాలతో పోటీపడి, యూరివర్శిటీల్లో సీట్లు పొంది పీజీచదవడం బీసీవిద్యార్థులకు ఎంతవరకుసాధ్యమవుతుందనే ఆలోచన చేయని జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని ఉద్ధరిస్తున్నాడంటే ఎలానమ్మాలి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షకు 3.12లక్షల మంది దరఖాస్తుచేసుకుంటే, వారిలో 70వేలమంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఫీజురీయింబర్స్ మెంట్ కు ఇస్తానన్న సొమ్మ సక్రమంగా ఇవ్వనందునే ఏపీ విద్యార్థులు పొరుగురాష్ట్రాలవైపు చూస్తున్నారు. ప్రాథమికవిద్య నుంచి ఉన్నతవిద్యవరకు విద్యార్థులకుఅందించాల్సిన సొమ్ము సక్రమంగా సకాలంలో జగన్ ప్రభుత్వం ఇవ్వనందునే విద్యార్థులు చదువుకు స్వస్తిచెప్పి పెడదారి పడు తున్నారు.
విద్యార్థులకు విద్య, యువతకు ఉద్యోగాలు అందించలేని జగన్, మాదకద్రవ్యాలు గంజాయితో వారి జీవితాల్ని నాశనంచేయడంలో మాత్రం ముందున్నాడు
ఒకవైపు విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించలేని జగన్మోహన్ రెడ్డి, మాదకద్రవ్యాలు గంజాయి వంటివాటిని మాత్రం విద్యార్థులు, యువతకు అందుబాటులో ఉంచుతున్నాడు. వైసీపీనేతల ఇళ్లలోనే గంజాయి, మాదకద్రవ్యాలు లభించేపరిస్థితి వచ్చిందంటే జగన్ ప్రభుత్వం ఎంతగా యువత జీవితాలను నాశనంచేస్తోందో అర్థంచేసుకోవచ్చు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ గంజాయి దొరికినా మూలాలు ఏపీతోనే ఎందుకు కనెక్ట్ అవుతున్నాయో ముఖ్యమంత్రి సమా ధానం చెప్పాలి. విద్యార్థులకు విద్యను, యువతకు ఉద్యోగాలను దూరంచేసిన జగన్, గంజా యి, మాదకద్రవ్యాలను మాత్రం ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి తెచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి తల్లులఖాతాల్లో ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్మ వేయడం వల్ల, 40శాతం మంది తల్లులు కళాశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించడంలేదని సుప్రీంకోర్టే చెప్పింది
పేదలు సకాలంలో ఫీజులుకట్టి చదువుకోలేరని భావించిన గతప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చే సొమ్మును కళాశాలల కు అందిస్తే, జగన్మోహన్ రెడ్డిమాత్రం తానే తెలివైనవాడినన్నట్టు తల్లులఖాతాల్లో వేస్తున్నాడు. దానివల్ల విద్యార్థులకు నష్టమే ఎక్కువ జరుగుతోంది. స్వయం గా సుప్రీంకోర్టు చేసినవ్యాఖ్యలే అందుకు నిదర్శనం అనిచెప్పాలి. ప్రభుత్వం తల్లులఖాతాల్లో ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్ము వేయడంవల్ల, 40శాతం మంది తల్లులు ఆసొమ్మును కళా శాలలకు చెల్లించడంలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఈ ప్రభు త్వం ఏంసమాధానం చెబుతుందని నిలదీస్తున్నాం. అటు విద్యార్థుల జీవితాలనే కాకుండా, ఇటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాల్ని కూడా జగన్ రోడ్డునపడేశాడు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇస్తానన్న ఫిట్ మెంట్, పీఆర్సీ చెల్లిం చకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సీపీఎస్ రద్దుఅనిచెప్పి ఉపాధ్యాయుల్ని నమ్మించి వంచించాడు. తనను, తనప్రభుత్వాన్ని ఎదిరించారన్న అక్కసుతో ఉపాధ్యాయుల పై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు. 4ఏళ్లలో రాష్ట్ర అప్పుని రూ.10లక్షలకోట్లకు పెంచి న జగన్, ఎక్కడా ఏవర్గానికి ఎలాంటి సంక్షేమం లేకుండా చేశాడు. డీ.బీ.టీ విధానంతో పేద ల్ని ఉద్ధరిస్తున్నానంటూ, 10రూపాయలిస్తూ, 100రూపాయలు దోచుకుంటున్నాడు.
పాఠశాలలు, కళాశాలల భవనాలకు రంగులేయడం తప్ప జగన్ 4ఏళ్లలో విద్యారంగానికి చేసింది శూన్యం
రాష్ట్రవిద్యావ్యవస్థను సర్వనాశనంచేసిన జగన్, ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రజల్ని నమ్మించా లని చూశాడు. ప్రతిపక్షాలు ఇంగ్లీష్ విద్యాభ్యాసాన్ని వద్దంటున్నాయని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. పాఠశాలభవనాలకు తనపార్టీ రంగులేయడం తప్ప జగన్ విద్యారంగాని కి, విద్యార్థులకు 4ఏళ్లలో చేసింది శూన్యం. జగన్ విద్యార్థులకు ఇచ్చేసొమ్ముని వాయిదాల పద్ధతిలోకాకుండా ఒకేసారి చెల్లించాలి. పీజీ విద్యార్థులకు కూడా ఎక్కడచదివినా ఫీజు రీయిం బర్స్ మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, స్టడీసర్కి ళ్లు, విదేశీవిద్య వంటి పథకాలతో విద్యారంగాన్ని, విద్యార్థుల్ని ఉద్ధరిస్తే, జగన్మో హన్ రెడ్డి మాత్రం కల్లబొల్లిమాటలు, మోసాలతో భావితరాల జీవితాల్ని నాశనంచేశాడు.” అని మాణిక్యరావు స్పష్టంచేశారు.