Suryaa.co.in

Features

పితృదేవతల కుమార్తె పేరు ఏమిటి?

పురాణము – అవగాహన
పితృ కార్యాలకు ముగ్గురు లేదా ఇద్దరు భోక్తలను ఆహ్వానించాలి. ఇద్దరు భోక్తలుగా ఉన్నప్పుడు ఏ దేవతలు భోక్తల స్థానములో కూర్చుని భోజనం చేస్తారు? ఒకరు విశ్వే దేవతల స్థానంలో, ఇంకొకరు పితృదేవతల స్థానంలో కూర్చుని భోజనం చేస్తారు. అందుకే భోక్తలను చాలా జాగ్రత్తగా గౌరవించాలి. వారిని విసుక్కోవడం వంటివి చేయరాదు.

శ్రాద్ధమునకు వండే వంట చాలా జాగ్రత్తగా మడితో చేయాలి. భోక్తలకు నివేదన కాకుండా మనం రుచి చూడడం, వండిన పదార్థాలలో వెంట్రుకలు వంటివి ఉండడం, భోక్తలు భోజనం చేస్తుండగా తుమ్మడం వంటివి చేయరాదు. ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒక దోషం లేకుండా చేయడం కష్టం. ఇలా తెలియనివి ఏవైనా దోషాలు తొలగాలంటే భోక్తలు భోజనం చేసే విస్తరిలో ఒక దళం ఉంచితే ఆ దోషాలు మనకు అంటవు. ఆ దళం ఏమిటి?

తులసీ దళం
భోక్తలుగా ఎవరిని ఆహ్వానించాలి? ఎవరు వస్తే గొప్ప ఫలితం వస్తుంది? భోక్తలుగా వచ్చే వారికి గల నియమాలు ఏమిటి? ఒకే ఇంటి పేరు ఉన్న వారిని భోక్తగా పిలువరాదు. సగోత్రికులని పిలవవచ్చు. ఒక్క యోగి లేదా పురాణజ్ఞుడు, పండితుడు భోక్తగా వస్తే అక్షయ ఫలితం వస్తుంది. ప్రతి అమావాస్య నాడు తప్పక పితృదేవతలను ఉద్దేశించి చనిపోయిన వారి పేరు మీదుగా తర్పణాలు, స్వయం పాకం వంటివి ఇచ్చి తీరాలని శాస్త్రము. ఎందుకు? అమావాస్యకు, పితృదేవతలకు ఉన్న సంబంధం ఏమిటి ?

ప్రతి అమావాస్యకు, చనిపోయిన వారి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి, వారి పిల్లలు తర్పణాలు, పిండములు (వారికి జలము, ఆహారం) ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండములు లేదా బ్రాహ్మణులకు స్వయం పాక దానము మొ౹౹ ఇవ్వకపోతే, ఇలాంటి పుత్రులను కన్నందుకు బాధపడి, ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారు. అదే వారికి తగిన తర్పణం, దానం మొ౹౹ ఇస్తే ఆకలి దాహం తీరి, వారు తృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలి.

దేహం విడిచి పెట్టిన వారిని ఉద్దేశించి, ఆ సంవత్సరం మొత్తం నెలకు ఒకసారి (మాసికము- చనిపోయిన తిథినాడు) తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానాలు చేయడం చేస్తారు. ఎందుకు? ముఖ్యంగా నెలలో చనిపోయిన తిథి నాడే ఎందుకు?

భూలోక వాసులకు 24 గంటలు ఒకరోజు; భూలోకంలో 30 రోజులు అంటే పితృదేవతలకు ఒకరోజు; భూలోకంలో 365 రోజులు అంటే దేవతలకు ఒకరోజు. కాబట్టి నెలకు ఒక సారి పెడితే పితృదేవతలకు రోజూ ఆహారం అందించిన వారమవుతాము.

సేకరణ

LEAVE A RESPONSE