Suryaa.co.in

National

ఉక్కు పరిశ్రమ రంగంలో స్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు

– పునరుద్ధరించిన ఎస్ఆర్టీఎంఐ వెబ్-పోర్టల్‌ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
– ఢిల్లీ వేదికగా ప్రోత్సాహకులకు ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ఢిల్లీ: ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో బుధవారం నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ (SteelCollab) ప్లాట్‌ ఫారమ్‌ ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ స్టీల్ పరిశ్రమ రంగంలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందని అన్నారు. నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ (SteelCollab) ప్లాట్‌ ఫారమ్‌ను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఉక్కు తయారీలో నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రధాన మోదీ నాయకత్వంలో బలమైన పునాదిని వేశామని పేర్కొన్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఉక్కు డిమాండ్ వృద్ధి GDP వృద్ధి ని అధిగమించిందని, ఇది ఆర్థిక అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు.స్టీల్ రంగ వృద్ధిలో స్థిరత్వాన్ని సాధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ఎస్ఆర్టీఎంఐ వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల వాటాదారులను, ఈ రంగం అభివృద్ధికి సహకరించడానికి ఆహ్వానిస్తున్నట్టు, నూతనంగా ప్రారంభించిన మూడు ఆర్ అండ్ డి పథకాలు స్టీల్ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు.

పరిశ్రమ నాయకులు, విద్యా నిపుణులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, స్టార్టప్‌లు వంటి వాటాదారులంతా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్టీల్ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్, విద్యారంగం ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE