యావత్ సాహిత్యరంగం
ఆశ్చర్యపడేలా,
ఆకాశాన్నంటే సముద్ర కెరటంలా
మహాకవి శ్రీశ్రీ వంటి వారు సైతం
ఆశ్చర్య పరిచేలా….
తెలుగు సాహిత్య రంగంలో ….
దిగంబర కవిత్వానికీ
ఆద్యుడిగా నిలిచిన
ప్రకాశం జిల్లా….
విప్లవ సాహితీ కెరటం…!!
వస్తువు ,శిల్పం ,శైలి లో
అతి నవ్యమైన పంథా
అనుసరిస్తూ….
అభ్యుదయ ప్రగతిశీల
సాహిత్య బావుటా ఎగురవేసి….
కవిగా గుర్తింపు కన్నా
సమాజంలో మార్పును
కోరుకున్న చైతన్య సంచలనం….!!
సమాజంలో కులతత్వం,
మత ప్రాబల్యం అధికమౌతూ….
అవినీతి, బంధుప్రీతి
మనిషి ప్రయోజనాలై
సామాజిక రాజకీయ స్థితిగతులు
నానాటికి దిగజారి పోతూ…
పతనావస్థకు చేరుకున్న దశలో…
తాను ఒకరికి బానిస అనే
సంస్కృతి నుండి వైదొలగి…
కలాన్ని పదునైన ఆయుధంగా
మలుచుకుని…..
తన కవిత్వం ద్వారా
ఎన్నో అంశాలను
సూటిగా నిలదీసి….
అన్ని రకాల సాంస్కృతిక
ఆరాధనలను …
ఘాటుగా ఆక్షేపించిన
విప్లవ శంఖారావం…..!!
ఒక విధ్వంసక
సామూహికత నుంచి
అంతులేని ఆధ్యాత్మిక
ఏకాంతంలోకి …
ప్రయాణం చేసిన అగ్ని శిఖ……!!
ఎంత హఠాత్తుగా ప్రారంభమైందో
అంతే హఠాత్తుగా
దిగంబర కవిత్వం తెరమరుగవుతూ
దిగంబర కవులు చెల్లాచెదురైనా
తుది శ్వాస వరకు
ఏకైక దిగంబర కవిగా
యిజాలతో సంబంధం లేని
ధైర్యవంతమైన
“సాహితీ బాటకు”పునాది వేసి…..
తెలుగు సాహిత్యరంగంలో
చిరస్థాయిగా నిలిచిన
కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు..
“మహాస్వప్న” గారికి
అక్షర కుసుమాలతో
అంజలి ఘటిస్తూ…..!!
– నలిగల రాధికా రత్న