– పోలీసుల దాడి
– అదుపులో ప్రముఖులు?
విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి శివారులోని ఓ రిస్టార్‌లో పేకాట నిర్వహిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు దాడి చేశారు. ఆదివారం తెల్లవారుఘూమున చేసిన మెరుపుదాడిలో పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.5,70,000 నగదు, రూ.25 లక్షలు విలువచేసే 321 కాయిన్స్, తొమ్మిది కార్లు, 23 సెల్ఫోన్లు సీజ్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఎస్ఈబీ సీఐలు అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్సైలు అమన్‌రావు, ఖగేష్, పద్మావతి, జ్ఞానేశ్వరిలు రిసార్ట్‌పై దాడి చేశారు. పోలీసులు దాడులు జరిగితే అధిక సొమ్ము పట్టుబడకుండా ఉండేందుకు పేకాటరాయుళ్లు నగదుకు బదులు కాయిన్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.