రవిప్రకాశ్ మీడియా లాంచ్ .. ఫిబ్రవరి 20న ప్రకటన?

Spread the love

TV 9 ఫౌండర్-ఛైర్మన్ రవిప్రకాశ్ కొత్త మీడియా ప్రకటన త్వరలోనే ఉన్నదని తెలుస్తోంది. టెలివిజన్, న్యూస్ పేపర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్తున్న రవిప్రకాశ్ బృందం ఏడు భారతీయ భాషల్లో కొత్త మీడియా సృష్టించటానికి రంగం సిద్ధం చేసుకుంది.

18 సంవత్సరాల క్రితం TV 9ను స్థాపించి, దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ నెట్ వర్క్ గా మలచిన టీమ్ ఇప్పుడు కొత్త పోకడలతో, సాంకేతిక మార్పులతో ఈ మీడియాకు రూపకల్పన చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్ తో పాటు సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ రవిప్రకాశ్ ప్రయత్నాలకు అండదండలందిస్తుంది.

దేశంలో జర్నలిజం పతనమైందనీ, ధనిక స్వాములకు, నేతలకు మీడియా దాసోహమంటోందన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ కొత్త మీడియా సంస్థ జర్నలిజం సత్తాను ప్రజలకు చూపిస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

Leave a Reply