ఫిష్ ఆంధ్ర మొబైల్ వాహనం రెడీ

Spread the love

ఇప్పటి వరకూ అంబులెన్స్‌లు.. ఇంటింటికి రేషన్ సరఫరా వాహనలు.. చెత్త వాహనాలు అన్నీ అలా ప్రారంభించారు. ఇప్పుడు ఫిష్ ఆంధ్రా పేరుతో చేపలు అమ్మేందుకు కూడా ప్రభుత్వం వాహనాలను సిద్ధం చేయించింది. అవి రోడ్ల మీదకు వస్తున్నాయి.

సీఎం జగన్మోహన్ రెడ్డి యువతకు చేపలు, రొయ్యలు అమ్ముకునే ఉపాధి కల్పించాలని ఎందుకో కానీ చాలా పట్టుదలగా ఉన్నారు. ప్రత్యేకంగా ఫిష్ ఆంధ్రా, మటన్ మార్టుల్ని డిజైన్ చేయించి.. ఆసక్తి ఉన్నవారికి సబ్సిడీ ఇచ్చి మరీ పంపిణీ చేస్తున్నారు. ఆ వాహనాలు ఇప్పుడు రెడీ అయ్యాయి.

చేపలు అమ్ముకుంటున్న వారి నుంచి విమర్శలు వస్తున్నా.. తమ ఉపాధిని దెబ్బకొడతారని ఆగ్రహిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల పులివెందులలో ఫ్రెష్ రొయ్యలు, చేపలు అమ్మే దుకాణాలు పులివెందులకు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని చేసిన ప్రకటన .. ఈ విషయంలో జగన్ పెట్టుకున్న అంచనాలేమిటో వెల్లడిస్తాయి. ఆ ప్రకారమే ఫిష్ ఆంధ్రా వాహనాలు సిద్ధమయ్యాయి. గల్లీ గల్లీలో వాటిలో చేపలు.. రొయ్యలు అమ్మే అవకాశం ఉంది.

Leave a Reply