Suryaa.co.in

Features

సరిహద్దులో జవాను.. ప్రతి పొద్దులో జమాను..!

ప్రతి పోలీసులో
రెండు కోణాలు
జడిపించే లాఠీ
రక్షించే డ్యూటీ..!

అంత లూజు
నిక్కరు నుంచి
ఇప్పటి సోకు
యూనిఫారం వరకు
ఎన్నో మార్పులు
కాని అదే ఖాకీ..అదే చలాకీ!

దాసరి వేస్తే
పోలీసు వెంకటసామి..
సూర్య అయితే సింగం..
అదే ఎన్టీఆర్ అయితే
కొండవీటి సింహం..
సాయికుమార్ కడితే
వాడేరా పోలీస్..
మొత్తానికి ఎవరు
వేషం కట్టినా
పోలీస్ అంటేనే
కనిపించని నాలుగో సింహం
యూనిఫారం తొడిగితేనే
అదో రకం ఆహం..!

ప్రతి క్షణం చెలగాటం
జీవితమంతా పోరాటం
ఇటూ అటూ
పొగలు కక్కే తుపాకులు..
మధ్య మండే ఎండుటాకులు..
మందుపాతర్ల
నడుమ మృత్యుకేళి..
డ్యూటీ అంటేనే మరణంతో కలిసి వెళ్లే వ్యాహ్యాళి..!

తప్పు జరిగితే మోగే విజిల్
తన నిజాయితీ
మాత్రం పజిల్
శారీరక దృఢత్వం..
కనిపించని కర్కశత్వం..
నేరం చేస్తే ఎంతటి వాడైనా
ఎక్కించేయి వాన్
డ్యూటీ ఈజ్ డివైన్..!

మొన్న కరోనా విలయవేళ
సర్వాంతర్యామి పోలీసు
ఆడేసాడు జనాలతో
ఢంకా పలాసు..
మెత్తగా చెబితే క్లాసు
లాఠీకి పని చెబితే మాసు..
మొత్తానికి నియంత్రణలో అతడి పాత్ర హై కలాసు..!

పోలీసునన్న అహంకారం..
విశృంఖల లంచావతారం..
ఏం చేసినా
చెల్లుతుందన్న కావరం..
ఠాణాలోనే రేపులు..
మృత్యుఘంటికలు
మ్రోగే లాకప్పులు
బూతులతో లేచిపోయే పైకప్పులు..
మేకవన్నె పులి మేకప్పులు
ఇవి మానేస్తే ఓ జమానూ
నువ్వు కాదా మరో జవాను
ఈ జాతికి నువ్వే పారాహుషార్
మేమంతా చెప్పమా
నీకు పదేపదే జోహార్..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE