అనంతపురం జిల్లా యాడికికి చెందిన ఆరుమంది బీసీ యువకులపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన తాడిపత్రి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవహక్కుల కమీషన్ కు లేఖ రాసిన తెదేపా నేత వర్లరామయ్య
• ఏపీలో పోలీసులు అధికార వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు.
• అసమ్మతి స్వరాలను అణచివేస్తున్నారు.
• ఒక వర్గం పోలీసులు రాక్షసంగా మారి ప్రతిపక్షాలను అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు, చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
• అనంతపురం జిల్లా యాడికి చెందిన ఆరుమంది బీసీ యువకులపై తాడిపత్రి పోలీసులు కస్టడీయల్ టార్చర్ కు పాల్పడ్డారు.
• అధికార పార్టీ మద్దతుదారులు బీసీ వర్గానికి చెందిన స్థానిక యానిమేటర్ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు.
• దీంతో అధికార పార్టీ అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.
• కానీ, వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు ఒక మహిళతో పాటు ఆరుమంది బీసీ యువకులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
• యాడికి పోలీసులు గుజ్జల ధనలక్ష్మిని మినహాయించిన మిగిలిన వారిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు.
• తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఫైబర్ లాఠీలతో బాధితులను చితకబాదారు. స్లాబ్ రాయిపై చేతి వేళ్లు పెట్టమని లాఠీతో వేళ్లపై కొట్టారు.
• బాధితులను కస్టడియల్ టార్చర్‌కు గురిచేసి వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోండి.
• రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలపై కమీషన్ కు అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసినా పోలీసుల పనితీరులో ఎటువంటి మార్పు లేదు.