– యుపీలో అలీకి షాక్
– హిందూ బాలిక వెంట పడ్డ అలీపై యోగి సర్కార్ ఎఫ్‌ఐఆర్
– ఓ మహిళ సాహస ఫలితం
అది ఉత్తరప్రదేశ్. అతడు ఒక కానిస్టేబుల్. పేరు షహదత్ అలీ. చూడ్డానికి మర్యాదుస్తుడిగా కనిపించే సదరు అలీ.. కొద్దికాలం నుంచి ఓ హిందూ మైనర్ బాలిక వెంటపడుతున్నారు. రోజూ స్కూలుకు సైకిల్‌పై వెళ్లే ఆ బాలికను.. కానిస్టేబుల్ అలీ రోజూ ర్యాంగింగ్ చేసేవాడు. మాటలతో వల వేసేందుకు ప్రయత్నించేవాడు. సదరు అలీ లేకితనం గమనించిన ఓ హిందూ మహిళ సాహసం చేసి, అతగాడిని ఫాలో చేసింది. ఆ మైనర్ బాలిక వెంట ఎందుకు పడుతున్నావని ధైర్యం చేసి నిలదీసింది. దానికి అతగాడు అడ్డంగా వాదించి, భయపట్టే ప్రయత్నం చేశాడు. పోలీసునన్న అహంకారం ప్రదర్శించాడు. దానితో ఆమె నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు, అలీ అరాచకం గురించి ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన పోలీసు ఉన్నతాధికారులు, అలీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అతగాడి కథను కంచికి చేర్చారు. మరి అంత సాహసం చేసిన మహిళను అభినందించాలి కదా?
– సంపత్‌రాజు