Suryaa.co.in

Features

ఇడ్లీ అమ్మిన భరత్.. ఇండియానే మెప్పించాడు!

– భరత్ కుమార్ .. ఒక ఇడ్లీ అమ్మిన వ్యక్తి!
– IIT98% మెరిట్ తో ఇస్రోలో జాబ్
– ఇప్పుడు చంద్రయాన్ 3 లో భాగస్థుడు
– ప్రతిభకు అడ్డురాని పేదరికం

చత్తిస్గఢ్ లో చరోడా అనే పట్టణంలో భరత్_కుమార్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని.తండ్రి బ్యాంకు దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. కానీ కొడుకు కు మంచి విద్య అందించాలి అనుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి ,సామాజిక పరిస్థితి అనుకూలించలేదు. అప్పుడు వారి అమ్మగారు ఇడ్లీ,టీ అమ్ముతూ జీవనం.గడుపుతున్నారు. వీరి పట్టణం చరోడా నుండి, బొగ్గును సరఫరా చేసే రైలు వెళ్తుంది..ప్లేట్ లు కడుగుతూ,టీ అమ్ముతూ జీవనం సాగించాడు భరత్. అలా చేస్తూనే కష్టపడి కాదు కాదు ఇష్టపడి చదువుకున్నాడు.

స్కూల్ చదువు అక్కడే కేంద్రీయ విద్యాలయంలో సాగింది. భరత్ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు, ఫీజుల కారణంగా tc తీసివేయడం సమస్య ఏర్పడింది, కానీ పాఠశాల ఫీజులు మాఫీ చేసి, ఉపాధ్యాయులు కాపీ బుక్ ఖర్చులు తీసుకున్నారు. భరత్ మెరిట్‌తో 12th పాస్ అయ్యాడు. ఐఐటీ ధన్‌బాద్‌కు ఎంపికయ్యాడు.

మళ్లీ ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు, రాయ్పూర్ వ్యవస్థాపకులు అరుణ్ బాగ్, జిందాల్ గ్రూప్ భరత్‌తో కలిసి పనిచేసాయి .ఇక్కడ కూడా భరత్, తన అద్భుతమైన ప్రతిభను పరిచయం చేశాడు . 98%తో ఐఐటి ధన్‌భాద్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

భరత్ ఇంజినీరింగ్ ఏడవ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు, అక్కడ ప్లేస్‌మెంట్‌లో భరత్‌ని ఎంచుకున్నారు. ఈ రోజు భారత్ చంద్రయాన్ 3 మిషన్‌లో భాగం అయ్యాడు.

నేటికి కేవలం 23 ఏళ్ల ఈ యువకుడికి చంద్రయాన్ 3 టీమ్ మెంబర్‌గా కే లాల్ అన్న మాట నిజమేనని రుజువు చేస్తోంది.

LEAVE A RESPONSE