Suryaa.co.in

Andhra Pradesh

కొడాలి నాని ఒక విశ్వాసం లేని .. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే కుక్క

రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కృష్ణా జిల్లా ఎస్పీ ఒక చేతకాని దద్దమ్మ
చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

కొడాలి నాని,వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. కొడాలి నాని ఒక విశ్వాసం లేని వ్యక్తి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఒక కుక్క. తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచిన విశ్వాసం లేని ఒక కుక్క. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకునే బతిమాలుకొని సీటు తీసుకుని రాజకీయంగా ఎదిగి వెన్నుపోటు పొడిచే వ్యక్తి కొడాలి నాని.

రేపటి రోజు అధికారం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ,అవసరమైతే వెన్నుపోటు పొడిచే విశ్వాసం లేని కుక్కలు వీరు. అధికారం కోసం గతంలో హైదరాబాదులో పలు రకాల గొడవలు సృష్టించి అధికారం చేపట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయాలసి చేసిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కేసులు మాఫీ చేసుకునేందుకు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం కాదా?

ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . చెన్నారెడ్డి తో తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు రాజేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ముఖ్యంగా హైదరాబాద్ ని అభివృద్ధి పథంలో నడిపించి అభివృద్ధి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఏమీ తెలియనటువంటి వ్యక్తి మన ప్రస్తుతం ముఖ్యమంత్రి
బాబాయ్ హత్యలో నుండి తమ వారిని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల మరియు అన్ని వర్గాలకు సంబంధించిన వారి సమస్యలు తెలుసుకునేందుకు, కుప్పం నుండి పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన నాయకుడు నారా లోకేష్ పై ఇటువంటి విమర్శలు చేయడం వైసిపి వారికి తగునా?

నారా లోకేష్ వెంట నడిచే కార్యకర్తలను బీసీ నాయకులను, అధికార వైసిపి పెయిడ్ ఆర్టిస్టులు అనడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.లారీ చక్రాలు మార్చుకునే కార్లు తుడుచుకునే వాళ్లు కూడా , నారా లోకేష్ గురించి మాట్లాడడం వారి దిగజారుడుతనం. రాజకీయాల్లో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడిన ప్రతి మాట వారి వాళ్ళని తిరోగమనం వైపు తీసుకు వెళుతుంది.

కొడాలి నాని వల్లభనేని వంశీ మాట్లాడే భాష వింటూ ఉంటే ఈ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది. పోలీసు వారు అధికార పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ వారిని ఇబ్బందుల గురిచేయడం దేనికి సంకేతం. కృష్ణా జిల్లా ఎస్పీ ఒక చేతకాని దద్దమ్మగా చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిన్న గంగన్నగూడెంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు టిడిపి నాయకుల ఫోటోలు వేసి కవ్వింపు చర్యలకు పాల్పడడం, అల్లర్లు సృష్టించే విధంగా ఫ్లెక్సీలు వేయడం దేనికి నిదర్శనం.

సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి . రేపు రాజకీయంగా అవసరమైతే కొడాలి నాని , వంశీని సైతం చంపడానికి వెనకాడని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రగల్బాలకు , అతి పోయి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని హితవు పలికిన కొల్లు రవీంద్ర.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో చరిత్రలో ఎన్నడు కనివిని ఎరుగని విధంగా పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. మిడ్ నైట్ వాక్ అనికొందరి మిడ్ నైట్ యాత్రలోని నారా లోకేష్ యువగళం యాత్రపై కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. పేల్చే వ్యక్తులు స్వయంగా యాత్రలోకి వచ్చి చూడాలని హితవుపలికారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 కి 16 నియోజకవర్గాలు గెలిచి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ దెబ్బంటే అధికార పార్టీ నాయకుల కు చూపిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు

LEAVE A RESPONSE