Suryaa.co.in

Entertainment

బాహుబలీ.. కట్టవయ్యా తాళి!

సిక్స్ ఫీట్..
సిక్స్ ప్యాక్..
గుడ్ లుక్..
బాహుబలితో పీక్..!

బుజ్జిగాడు.. మేడిన్
కృష్ణంరాజు ఖాందాన్..
పెదనాన్న అడుగుజాడల్లో
హిట్టు సినిమాల కాంటాక్ట్..
ఈ మిస్టర్ పర్ఫెక్ట్..!

ప్రభాస్..
ఏ పాత్రకైనా ఓ యస్..
ఈశ్వర్ గా శ్రీకారం చుట్టి..
రాఘవేంద్రుడై..
హిట్టు వర్షం లో తడిసి..
అడవిరాముడై..
చక్రం తిప్పిన ఛత్రపతి….
పౌర్ణమి కి ముందు భోగి..
పిదప యోగి.. గా
అవతరించిన ఉప్పలపాటి
వారింటి మున్నా..
అఖిలాంధ్ర డార్లింగ్…!

రాజుగారింటి రెబల్..
తన ప్రతిభంతా కూర్చి
కూరేసాడు మిర్చి..
ఇదంతా ఓ పరంపర..
చించేసాడు వెండితెరను
పరపరా..!

ఇన్ని చేశాక..
ఇంత సాధించాక..
ఒదుల్తాడా జక్కన్న..
ఒట్టేసి ఒక మాట..
వెయ్యకుండా ఒక మాట చెప్పని కుర్రాడితో
ఛత్రపతి నాడే తీసుకున్నాడేమో
అయిదేళ్ల కాల్షీట్..
రెండు సినిమాలు టార్గెట్..
ఇండియాకే స్టారైనా
ఇంటివాడు కాలేకపోయాడు!
ఆరేళ్లకే లవ్ స్టోరీ నడిపిన
బుజ్జిగాడు నలభై దాటినా
బ్రహ్మచారి..ది కంక్లూజన్
అనలేకపోయాడు..పాపం..!
లేకపోయినా ఏ లోపం..!!!

ఈ పుట్టినరోజు
దగ్గర చెయ్యాలి పెళ్లిరోజు..
జాతకాల రాధేశ్యామ్
తన జాతకాన్ని సరిచూసుకుని
పెళ్లిపీటలెక్కి
సాహో అనాలి..
ఆదిపురుషుడై..!

సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE