అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తిప్పను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “సిపిఎస్” (CONTRIBUTERY PENTION SCHME) రద్దు చేస్తాను ఏ ప్రభుత్వము ఇవ్వని అద్భుతమైన “పిఆర్సి” ఇస్తాను అని ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఏపీ సీఎం ఇచ్చిన మూడు PRC జీవోలను వెంటనే రద్దు చేయాలి!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు పిఆర్సి, ఓ పి ఎస్ (OLD PENTION SCHME) లు ” సంజీవిని ” లాంటివి!దేశవ్యాప్తంగా పెట్రోల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఉద్యోగస్తుల జీతాలతో పాటు వారి జీవన విధానంలో కూడా పురోగతి రావాలని గత ప్రభుత్వాలతో ఉద్యోగ సంఘాలు పోరాడి సాధించుకున్న ఫిట్మెంట్ బెనిఫిట్స్ లో సైతం కోత విధించడం ఏపీ ప్రభుత్వానికి ధర్మమేనా!
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ఉద్యోగస్తుల పాలిట “శాపంగా” మారిందని పదవీ విరమణ తర్వాత ఏ ఒక్కరికి కనీస పెన్షన్ భద్రత కూడా ఉండదని దేవుని దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “సిపిఎస్ ను రద్దు” చేసి “ఓ పి ఎస్ పద్ధతిలో పెన్షన్లు” ఇస్తామన్న సీఎం ప్రకటనతో నమ్మి మోసపోయామా లేక నమ్మించి మోసం చేశారా అన్న ఆవేదనతో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక,పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇచ్చిన 3 చీకటి జీవోలను బహిరంగంగా రోడ్లపై దహనం చేస్తున్నారు!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలలోని ఉద్యోగస్తులకు సముచితమైన పిఆర్సి, ఫిట్మెంట్, పెన్షన్ బెనిఫిట్స్ లతోపాటు పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగస్తునికి,ఉపాధ్యాయునికి అదే రోజు గౌరవంగా సత్కరించి “రిటైర్మెంట్ బెనిఫిట్స్” చేతికిచ్చి గౌరవంగా ఇంటికి సాగనంపారు
మరి నేడు పదవీ విరమణ చేసిన వారికి “రాగి నయాపైసా” పదవీ విరమణ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను సాగనంపడం అన్యాయం కాదా!
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆవేదన పై అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించాలి ప్రభుత్వం ఇచ్చిన 3 పిఆర్సి జీవోలను రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను!ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను!
నవీన్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ నేత
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు