Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలు పార్లమెంట్ ప్రజాప్రతినిధుల సవతి తల్లి ప్రేమ

ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికకు మోడల్
ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్
కేంద్రమంత్రులతో భేటీ

ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ ఒంగోలు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం, రెండు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి ప్రణాళికను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్, జాతీయ హెలికాఫ్టర్ శిక్షణ సంస్థ, ఫిషింగ్ హార్బర్, దొనకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఒంగోలు నుండి దొనకొండ మధ్య రైల్వే లైన్ మరియు పశ్చిమ ప్రకాశం జిల్లాలో త్రాగు, సాగు నీటి సమస్యలు, యువత ఉపాధి వంటి అంశాల గ్రానైట్ లోడు ప్రమాదాల నివారణ కోసం ఒంగోలు పట్టణం పశ్చిమాన బైపాస్ రోడ్ నిర్మాణం వంటి అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ , రైల్వే మంత్రి అశ్వని వైద్యవ్ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ను కలిసి ఆయా ప్రాజెక్టుల పురోగతి కోసం మంత్రులను కలిసి లేఖలు ఇవ్వడం జరిగింది.

లేఖల్లోని ముఖ్యాంశాలు :

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఇచ్చిన లేఖలో “ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంలో సమ్మిళిత వృద్ధి” కోసం ప్రతిపాదన” చేయడం జరిగింది. “వికసిత సంకల్ప భారత్ యాత్ర”, “గావ్ చలో అభియాన్” & “వెలిగొండ మరియు గుండ్లకమ్మ నీటిపారుదల మరియు తాగునీటి ప్రాజెక్టుల ఆందోళన” వంటి అంశాల పరిశీలన కోసం ఒంగోలు పార్లమెంటు అంతటా పర్యటించాను, ముఖ్యంగా జిల్లా పశ్చిమ భాగం వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది

సామాజిక, భౌగోళిక, మౌలిక సదుపాయాలు వంటి దాదాపు అన్ని సూచికలలో ప్రజలు మరియు ప్రాంతం యొక్క వెనుకబాటుతనాన్ని నేను గమనించాను మరియు వివిధ పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ స్థానిక ప్రభుత్వలు సంవత్సరాలు తరబడి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన షెడ్యూల్‌ను అమలు చేయడం కోసంఒంగోలు పార్లమెంటు నుండి లోక్‌సభ మరియు అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిబద్ధత లేకపోవడంతో అనేక సంవత్సరాలుగా అప్రయత్నంగా పెండింగులోనే ఉన్నాయి.

ఒంగోలు పార్లమెంట్‌లో అందుబాటులో ఉన్న వనరులతో సమస్యలను ఎదుర్కొనేందుకు, ఒంగోలు పార్లమెంట్ పరిధి ప్రాంతాలలో ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులను మరియు మౌలిక సదుపాయాలను అనుసంధానం చేయడం ద్వారా “ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంత సమగ్ర వృద్ధికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్”ను ఈ క్రింది అంశాల ప్రాతిపదికనసిద్ధం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించడం జరిగింది.

దొనకొండ పారిశ్రామికవాడకు సంబంధించిన 17,117 ఎకరాలతో నోడ్ మరియు అతిపెద్ద జాతీయ హెలికాప్టర్ శిక్షణా సంస్థ, 14,231 ఎకరాలతో కనిగిరిలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ మరియు కొత్తపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌తో పాటు ఒంగోలులో సముద్ర తీరప్రాంతాన్ని అత్యున్నత పర్యాటక కేంద్రంగా, 2) విమానాశ్రయాలతో మరియు షిప్పింగ్ పోర్టులతో దొనకొండ మరియు కనిగిరి పారిశ్రామిక వాడలు అనుసంధానించడానికి జాతీయ రహదారులు మరియు రైలు మార్గాలను అనుసంధానం కోసం ప్రతిపాదిన, 3) దొనకొండ మరియు కనిగిరి ప్రాంతాలలో రాజ్‌స్థాన్ మోడల్‌తో భూగర్భ జలాలను మెరుగుపరచడానికి ప్రణాళిక , 4) ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వెలిగొండ మరియు గుండ్లకమ్మ నుండి తాగు, సాగు నీటిపారుదల మరియు పారిశ్రామిక అవసరాల నీటి వనరుల కోసం ప్రణాళిక మరియు మరియు 5) సర్వే పూర్తి చేసి సానుకూలంగా ఉన్న ఒంగోలు నుండి దొనకొండ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్‌ను చేపట్టమని కోరడం జరిగింది.

అలాగే కేంద్ర ప్రభుత్వం దొనకొండలో హెలికాఫ్టర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి ఏడు సంవత్సరాలు దాటింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అడుగు ముందుకు పడలేదనే విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తేవడం జరిగింది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి నిజమైన అంత్యోదయకు అర్థం దొనకొండ లాంటి ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ క్రింద 18.30 కోట్ల రూపాయిల నిధులు దొనకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పనులు మొదలు పెట్టడం మరియు కేంద్ర ప్రభుత్వం దొనకొండ రైల్వే ఆసుపత్రి ఆధునీకరణ పూర్తి చేయడాన్ని స్మరిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సూచన మేరకు “ పల్లెకు పోదాం – గావ్ చలో అభియాన్ “ కార్యక్రమంలో రైల్వ్ పెన్షనర్ల అసోసియేషన్ ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఉటంకిస్తూ దొనకొండ చుట్టు పక్క గ్రామాల ప్రజల సౌకర్యార్థం అమరావతి ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, కొండవీడు ఎక్స్ప్రెస్ మరియు విజయవాడ – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైళ్ళును దొనకొండ రైల్వే స్టేషన్ వద్ద నిలపాలని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ని కోరుతూ లంకా దినకర్ వినతిపత్రం ఇవ్వగా అయిన సానుకూలంగా స్పందించారు.

గ్రానైట్ లోడు లారీల ప్రమాదాల నివారణ మరియు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసంఒంగోలు పట్టణానికి పశ్చిమ దిక్కున బైపాస్ రోడ్ కోసం కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ దృష్టికి తేవడం జరుగింది.

ఒంగోలు పార్లమెంట్ గడచిన 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం ప్రజాప్రతినిధులకు తల్లి ప్రేమ లేని సవతి తల్లి ప్రేమ చూపే వారికి మాత్రమే అన్ని పార్టీలు అవకాశాలు ఇవ్వడమే ప్రధాన కారణం.

ఒంగోలు తీరప్రాంత పర్యాటక అభివృద్ధి మరియు మత్స్యకారుల ఉన్నతి కోసం ఫిషింగ్ హార్బర్ తో పాటు దొనకొండ మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఉద్యోగాల కోసం వలస వెళ్లకుండా అక్కడ రాష్ట్రంలో ఉపాది దొరికే ప్రాంతంగా తీర్చి దిద్దే ప్రణాళిక రూపొందించే నివేదికలో జిల్లాలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పారిశ్రామిక వాడలను రోడ్ , రైల్ , షిప్పింగ్ పోర్ట్లతో అనుసంధానం చేసే నివేదిక వివరాలు త్వరలో తెలియచేస్తాం, ఈ నివేదిక రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికకు మోడల్ గా నిలుస్తుంది.

 

LEAVE A RESPONSE