రష్యా లాంటి పెద్ద దేశం దండయాత్ర చేస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్క వెనక్కి తగ్గడం లేదు. తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా, నాటో దళాలు పట్టించుకోకపోయినా ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు. 4 కోట్ల మంది ప్రజల కోసం తానే స్వయంగా యుద్ధరంగంలో దిగారు. సైనికులను ముందుండి నడిపిస్తున్నారు. దేశం కోసం పోరాడే వారందరికీ ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.