– హోంమంత్రి వనితతో ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ భేటీ
ఆంద్రప్రదేశ్ సచివాలయంలో హోం శాఖ మాత్యులు తానేటి వనిత ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ మర్యాదపూర్వకంగా కలిసారు. తానేటి వనిత నూతనంగా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పుష్పగుచ్చేం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణకు శాఖా పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలను, కార్యక్రమాలను హోంమంత్రి కి ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు.
కంపెనీలు, గౌడౌన్ లలో అగ్నిప్రమాదం జరిగిన సమయాల్లో సరికొత్త టెక్నాలజీ ద్వారా నష్ట తీవ్రతను తగ్గిస్తున్నామని చెప్పారు. ఫైర్ డిపార్ట్మెంట్ తరుపున త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. హోంమంత్రి తానేటి వనితని కలిసిన వారిలో ఫైర్ అడిషనల్ డైరెక్టర్ మురళి మోహన్, ఈస్ట్రన్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ జి. శ్రీనివాసులు, సదరన్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ E.స్వామి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ సన్యాసి నాయుడు, ఇతర ఫైర్ సర్వీస్ అధికారులు ఉన్నారు.