ప్రజలకు ఒక నమ్మకం వలంటీర్ వ్యవస్థ..

– ప్రజాస్వామ్య లో నిజమైన స్పూర్తితో, ఆలోచన చేసిన బాబా అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా గానే వాలంట్రీ వ్యవస్థ
– సచివాలయం, వాలంట్రీ వ్యవస్థ తోనే రామచంద్రపురం నియోజక వర్గానికి ఇన్పుట్ సబ్సిడీ గా 25 కోట్ల రూపాయలు
– సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ

అమలాపురం: రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో మూలస్తంభాలుగా ఉన్న వాలంటీర్ల సేవలు వెల కట్టలేని నిస్వార్థ సేవలకు చిరుకానుకగా ఈ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు అందిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మాత్యులు చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

బుధవారం కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో ని MPDO కార్యాలయం వద్ద కె గంగవరం మండలం పరిధిలోని గ్రామ, వార్డు వాలంటీర్ల విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం మూడు కేటగేరిలో మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు ప్రధానంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని లక్షిత వర్గాలకు సంక్షేమ ఫలాల లబ్దిని ప్రభుత్వ సేవలను వారి ఇంటి ముంగిటనే అందిస్తూ వాలంటీర్లు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అవినీతికి, వివక్షతకు తావు లేకుండా పథకాల లబ్ధి ప్రభుత్వ సేవలను చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల క్రితం వాలంటర్ వ్యవస్థ ప్రవేశ పెట్టిందన్నారు. వాలంటీర్లు మానవతావాదాన్ని నింపుకుని నిస్వార్థ సేవలకు ప్రతి రూపంగా పనిచేస్తూ లబ్దిదారుల ముఖాల్లో చిరునవ్వును స్వయంగా చూసే భాగ్యం వాలంటీర్లకే దక్కిందన్నారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకు అందించడంలో విశిష్ట సేవలను గుర్తించి ప్రోత్సాహించేందుకు ఈ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూన్నామన్నారు.

ఈ అవార్డుల ద్వారా మరింత పోటీ తత్వాన్ని స్ఫూర్తిని పొంది ప్రజా సేవలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిగా అంకితం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో కీలకమైన వ్యవస్థగా గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని తద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని వాలంటీర్లకు సూచించారు. భారతదేశ చరిత్రలోనే ఏపీ లో పనిచేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ చరిత్రాత్మక గుర్తింపు పొందిందని పక్క రాష్ట్రాల సైతం ఆలోచింప చేసి ఆయా రాష్ట్రాల్లో కూడా ఆచరణలో తెచ్చేలా ఈ వ్యవస్థ పురికొల్పిందన్నారు.

ఈ వ్యవస్థ ద్వారా 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లు సముచితంగా పని చేసి మంచి గౌరవం పొందాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, అనుసంధానానికి కర్తలుగా పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తూన్నారన్నారు.

కె గంగవర0 MPDO VD రత్నకుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో 385 సేవామిత్ర, 378, సేవారత్న, 5 సేవావజ్ర 2 పురస్కారాలు పొందారని వీరికి నగదు పారితోషకం తోపాటు ప్రశంస పత్రం, బ్యాడ్జీ, శాలువతో సత్కరించటం జరిగిందన్నారు.

క్షేత్రస్థాయిలో అమోఘమైన, ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యసస్థను ప్రవేశ పెట్టి పేదవారి మన్ననలు పొందడం పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కె గంగవరం సర్పంచ్ కోటి లక్ష్మీ నరసింహ, ఎంపీపీ పంపన నాగమణి, జడ్పీటీసీ ఓబులనేని వరలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply