– తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఒమన్ రాజ కుటుంబీకులు
– డబ్ల్యూటీఐటీసీ అధ్యక్షుడు సందీప్ మఖ్తల ఆహ్వానం మేరకు రాక
– ఒమన్‌లో టెక్నాలజీ రంగం అభివృద్ధిపై సలహాల స్వీకరణ
– ఒమన్, WTITC మధ్య ఒప్పందం
– మస్కట్, సోహార్ లేబర్ కాంపుల్లో స్వయంగా పర్యటించి తెలుగు వారికి భరోసా నింపిన మఖ్తల
ఒమన్/ హైదరాబాద్, ఏప్రిల్ 11, 2023: చమురు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశాల్లో ఒకటైన ఒమన్ దేశ యువరాజు హిస్ హైనెస్ అల సయ్యిద్ ఫైరస్ ఫాతిక్ వచ్చే మే నెలలో తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC ) అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల ఆహ్వానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సందీప్ మఖ్తల ఒమన్ పర్యటనలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఒమన్ డబ్ల్యూటీఐటీసీ ప్యాటర్న్ సభ్యునిగా ఉండేందుకు ఫైరస్ ఫాతిక్ అంగీకారం తెలపడంతో మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఒమన్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధికి పలు సలహాలు స్వీకరించిన ఒమన్ యువరాజు ఈ మేరకు WTITCతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సందీప్ మఖ్తలకు తెలియజేశారు. ఒమన్, తెలుగు రాష్ట్రాల మధ్య విద్యార్థుల ఎక్సేంజ్ ప్రోగ్రాంకు సైతం ఓకే చెప్పారు.
సందీప్ మఖ్తల నాయకత్వంలోని వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) బృందం గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా, ఒమన్‌లో నేడు ఒమన్ కింగ్ హైతం బిన్ తారిక్ కుమారుడిని కలిశారు. WTITC ఏర్పాటు ఉద్దేశం, చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా సందీప్ మఖ్తల ఒమన్ యువరాజు ఫైరస్ ఫాతిక్ కు వివరించారు. ఇంధనం వెలికితీత వంటి అంశాలలో ఎదిగినప్పటికీ సాంకేతికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఒమన్ ఈ మేరకు కృషి చేస్తే కలిగే అవకాశాలను సందీప్ మఖ్తల వెల్లడించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల యొక్క ప్రాధాన్యతను వెల్లడించారు. ఒమన్‌లోని విద్యార్థులు మరియు యువతకు టెక్నాలజీలో శిక్షణ అందించేందుకు తమ ప్రత్యేకతలను సందీప్ మఖ్తల తెలియజేశారు.
వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అధ్యక్షుడు సందీప్ మఖ్తల అందించిన విశ్లేషణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఒమన్ యువరాజు ఫరాజ్ టెక్నాలజీలో ఒమన్- WTITC కలిసి చేసేందుకు త్వరలో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటుగా WTITC పాటర్న్ హోదా స్వీకరించేందుకు అంగీకరించడంతో, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని రాజకుమారుని సందీప్ మఖ్తల అందచేశారు. యూనివర్సిటీల విద్యార్థులకు ఎక్సేంజ్ ప్రోగ్రాం చేపట్టేందుకు, డబ్ల్యూటీఐటీసీ ఆహ్వానం మేరకు వచ్చే మే నెలలో తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తానని వెంటనే అంగీకారం తెలియజేశారు.
ఈ పర్యటన సందర్భంగా ఒమన్ లోని పలు యూనివర్సిటీలను సందర్శించి విద్యార్థులతో సందీప్ మఖ్తల బృందం అనుసంధానం అయింది. ఒమన్ నగరాల్లో పర్యటించి టెక్నాలజీ పరంగా ఉన్న అవకాశాలను ఈ బృందం అధ్యయనం చేసింది. మస్కట్, సోహార్ నగరాల్లో ఉన్న లేబర్ క్యాంను సందర్శించిన సందీప్ మఖ్తల అక్కడ తెలుగు వారి కష్టాలు చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారి కష్టాలను ఒమన్ మరియు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడమే కాక రాజకుమారుని దగ్గర ఈ ప్రస్తావన తెచ్చారు.
రిట్జ్ గ్రూప్ అధినేత ఎంఎన్ఆర్ గుప్త, ఎస్ఎస్ఆర్ క్లౌడ్ అధినేత శశిధర్ శర్మ, WTITC సభ్యులు కరీం షేక్, హేమంత్ సర్వబొట్ల, అభిషేక్ రెడ్డి అర్రబోలు ఒమన్ పర్యటనా బృందంలో ఉన్నారు.