కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్
విజయవాడ : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామగ్రామాన జరుగుతుంది. కేంద్ర పధకాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర సాగుతుంది. ఏపీ లో 26 జిల్లాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 125 వాహనాలతో ఈ యాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది నేటి వరకు ఈ యాత్ర లో భాగస్వామ్యం అయ్యారు.
అర్హత ఉన్న వారు ఆయా పధకాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరమైన పరీక్షలు కూడా నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తున్నాం. ఐదు లక్షల ఉచిత వైద్యం కోసం ఆయుష్మాన్ కార్డులు అంద చేస్తున్నాం. యన్టీఆర్ జిల్లా లో పర్యటించాను కేంద్ర పధకాల పై ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు కూడా వైద్య సేవలు అందుబాటులో కి తెచ్చాం.
ప్రజలు కూడా కేంద్ర పధకాల పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోండి. మహిళల సంరక్షణ, రైతుల కోసం అనేక పధకాలు అమల్లో ఉన్నాయి. 1672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పధకం కింద సదుపాయం కల్పించారు.
ల్యాండ్ రికార్డు లను 5292 గ్రామాల్లొ పూర్తిగా డిజిటలైజ్ చేశాం. ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చాం. అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి తెచ్చాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పధకాలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరంగా, ఆర్ధిక పరంగా మంచిగా ఉండాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేసే పధకాల పై విస్తృతంగా ప్రచారం చేయాలి.. అందరూ తెలుసుకోవాలి.
కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా లబ్ది దారులు ను గుర్తించేందుకు మీ గ్రామాలకు రావడం జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు కు రాలేనివారు మీ గ్రామాలకు వస్తున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వాహనాల వద్ద కు వచ్చి సంక్షేమ పథకాలు కు దరఖాస్తు లు చేసుకోవాలి అన్నారు.
యన్టీఆర్ జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,ప్రవాస్ యోజన రాష్ట్ర కన్వీనర్ పాకా సత్యన్నారాయణ,BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ప్రవాస్ యోజన సభ్యులు సుదాకర్ యాదవ్, జిల్లా BJP ప్రధాన కార్యదర్శులు కొలపల్లి గణేష్,భోగవల్లి శ్రీధర్, జిల్లా BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు యర్ర సునీత
తదితరులు పాల్గొన్నారు.