మధిర భట్టి క్యాంపు కార్యాలయానికి పోటెత్తిన అభిమానులు

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు
-నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
-మూడు గంటల పాటు సాగిన సన్మానాలు సత్కారాలు వినతుల వెల్లువలు

గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు నెల రోజుల పాలన పూర్తి చేసుకోవడంతో పాటు మధిరకు పౌర సన్మాన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి ఆదివారం క్యాంపు కార్యాలయానికి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఖమ్మం జిల్లా తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ, విజయవాడ, కృష్ణా, ఏలూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిలువెత్తు పూల దండలతో ఘనంగా సన్మానం చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఓపికగా వేల మంది అభిమానులను, కార్యకర్తలను భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా వారు శాలువాలు కప్పి పూల మాలలు వేసి పుష్పగుచ్చం అందించి తమ అభిమానాన్ని చాటు కొని శుభాకాంక్షలు చెప్పారు.

అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు, డిప్యూటీ సీఎం గా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోలు, హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా తీసిన ఫోటోలను ఆల్బమ్లుగా తయారు చేయించి అభిమానులు ఈరోజు ఆయనకు బహుకరించారు.

మధిర నియోజకవర్గం లోని ఎర్రుపాలెం బోనకల్ మధిర చింతకాని ముదిగొండ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు పార్టీ శ్రేణులు భట్టి విక్రమార్క కలిసి వయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని కోరారు.

అదేవిధంగా భూవివాదం, ధరణి, విద్యుత్తు, ఇళ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం తదితర సమస్యలపై వ్యక్తిగతంగా చాలా మంది డిప్యూటీ సీఎంకు విన్నవించుకున్నారు.

ప్రముఖుల శుభాకాంక్షలు
భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్ ఎం భాష, జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు

Leave a Reply