– టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మ లు సైకో జగన్ ని ఒక సారి ఎవరికైనా చూపించాలని, ఇలాగే వదిలేస్తే ఆడవాళ్లు బయటికొచ్చే పరిస్థితులు లేవని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సలహా ఇచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
గతంలో పోలీసులకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడనప్పటికినీ వాడకూడని పదమేదో మాట్లాడారని సాక్ష్యాత్తు సీఎం స్థాయిలో ఉన్న జగన్ కార్యాలయాలపై రాళ్లు, రప్పలు విసిరించారు. పైగా కార్యకర్తలకు బీపీ వచ్చిందని సమర్థించుకున్నారు. టీడీపీ కార్యాలయాల మీద కూడా రాళ్లు, రప్పలు వేయించారు. ఇప్పుడు భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబునాయుడు చేత కంట తడి పెట్టిండంపై మేమేం చేయాలి?
చంద్రబాబునాయుడు ఒక చిటికేసి కార్యకర్తలకు చెబితే.. టీడీపీ కార్యకర్తలే కాకుండా ఎన్టీరామారావు అభిమానులందరూ ఇండ్లల్లో నుంచి బయటికి వచ్చి వైసీపీ నాయకుల అంతు చూడగలరు. సైకోలకు కన్నీళ్లు చూస్తే ఆనందమేస్తుంది. చంద్రబాబునాయుడు చేత కన్నీళ్లు పెట్టించడంతో వైసీపీ నాయకుల సైకోయిజం బయటపడింది. సైకోలకు తల్లి కన్నీళ్లు, చెల్లి కన్నీళ్లు అవేవీ కనపడవు. ఎవరిచేతనైనా కన్నీళ్లు పెట్టించగలరు. జగన్ తల్లి, చెల్లి కన్నీళ్లకు కరగలేదు. చంద్రబాబునాయుడు కన్నీళ్లకేం కరుగుతాడు? చంద్రబాబు చిటికేసి వైసీపీ నాయకులు ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని స్థితిని తీసుకరాగలరు.
గతంలో కార్యకర్తలకు బీపీ వచ్చి కార్యాలయాలపై దాడి చేశారని చిలకపలుకులు పలికిన డీజీపీ ఇప్పుడు మాజీ సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలేవీ? వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చని డీజీపీ వారికి రాసిఇచ్చినట్లుంది. చంద్రబాబు విలువలు కలిగిన వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. రాబోయే కాలంలో సీఎం ఆయనే . మేమంతా సైనికుల్లా పనిచేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఆయనను మళ్లీ సీఎం చేస్తాం. అందులో అనుమానం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేం వ్యవహరిస్తాం. ఒక పేటీయం బ్యాచ్ ఒక అమ్మ గురించి ఇలా మాట్లాడటమా?
ఇలాగే వ్యవహరిస్తే ఆడవాళ్లు చెప్పులతో దాడి చేసే రోజులు రాగలవు. జబర్దస్ లో డబల్ మీనింగ్ డైలాగులకు మార్కులిచ్చే రోజా.. రాజకీయ విలువల గురించి మాట్లాడటమా? రోజాకు రాజకీయ బిక్ష పెట్టింది టీడీపీనే. టీడీపీనే ఆమె పునాదులు. ఇంకోసారి భువనేశ్వరి గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడితే ఆడవారు చెప్పులతో దేహశుద్ధి చేస్తారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు లు అసెంబ్లీలో కూర్చోవడం ప్రజల దౌర్భాగ్యమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. డీజీపీ వెంటనే భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపట్ల కేసు పెట్టాలి. వైసీపీ నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సూచించారు.