– రాజేంద్ర నగర్ ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రైతన్నల ఆశీర్వాదంతో తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమం అనే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతుంది. రైతు శాస్త్రవేత్తలతో యాంత్రీకరణ ,నూతన మెలకువలు ,విత్తనాలు అనేక రకాల సాగు పద్ధతులు వరి సాగు మాత్రమే కాకుండా, అధిక ఆదాయం వచ్చే పంటలు వేసేలా వ్యవసాయ శాఖ ను స్వయంగా రైతు అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణ లో ముందుకు పోతుంది
రైతు రుణమాఫీ ,రైతు భరోసా , సన్న వడ్ల కు 500 బోనస్ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ దేశానికి రైతు వెన్నుముక. రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ముందుకు పోదు. .ఈ ప్రభుత్వం మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ వ్యవసాయాన్ని తీసుకుపోయే విధంగా ఉండాలి.