– మెడికల్ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరణ
– గ్రామ, వార్డు స్థాయిల్లో ‘రచ్చబండ’ కార్యక్రమం
– అక్టోబరు 10 నుంచి నవంబరు 22 వరకు రచ్చబండ
– అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
– నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణ
– నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు
– నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలింపు
– ఆ తర్వాత గవర్నర్‌గారికి నివేదన. కోటి సంతకాల పత్రాల అందజేత
– పార్టీకి వైయస్ జగన్ దిశా నిర్దేశం
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం
తాడేపల్లి: వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో «అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలు ప్రస్తావించిన ఆయన, పార్టీ కార్యాచరణను ప్రకటించారు.
ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణ, యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని ఆయన నిర్దేశించారు. వాటిపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేలా కృషి చేయాలని, ఆ దిశలో చొరవ చూపాలని ఆదేశించారు.
కొత్త మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి, గవర్నర్‌కు సమర్పించనున్నట్లు వైయస్ జగన్ వెల్లడించారు. అదే విధంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్›్జ, సిలికా, ల్యాటరైట్ ఏదైనా అంతే. చివరకు లిక్కర్ కూడా. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. విచ్చలవిడిగా మాఫియా కనిపిస్తోంది.
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ తమకు సంబంధించిన వాళ్లకు పావలాకు, అర్ధ రూపాయికి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మన హయాంలో ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 ఏళ్లు అందు కోసం ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్‌కు రూ.2.49 చొప్పున అగ్రిమెంట్ చేసుకుంటే.. నానా యాగీ చేసిన వీళు ఈరోజు యూనిట్లకు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు.
డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో కూడా అక్రమాలు చేస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమిషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. అలా వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునేందుకు ఒక ఎత్తు.
ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్ధన్‌రావు, సురేంద్రనాయుడు అనే వ్యక్తులు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై సూపర్వైజర్ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి అప్పగించారు.
నియోజకవర్గంలోని ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్‌లు, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు విజయవాడ చేరువలోని ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటారు. వీళ్లే బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కాటన్బాక్సో్ల స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిల్సు్న చూసి ఎక్సైజ్ శాఖ అధికారులే విస్తుపోతున్నారట.
నర్సీపట్నంకు చెందిన పార్టీ నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదస్పద ఎమ్మెల్యేకు బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ నీట్‌గా ఏర్పాటు చేశారు.
అమలాపురంలో కూడా మిషన్లు, బాక్సు్ల, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ నీట్‌గా అమర్చారు. మాస్కులతో అక్కడ పని చేసే వారిని కప్పిపెట్టారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో కూడా పరిశ్రమ ఏర్పాటు చేశారు.
ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మేలో ఫీజురీయింబర్సె్మంట్ ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం.
అక్కడి నుంచి పోస్ట్‌పోన్ చేసుకుని 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్సె్మంట్ ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు. ప్రతి క్వార్టర్‌కి సుమారు రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడు త్రైమాసికాలకు గాను దాదాపు రూ.4500 కోట్లు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమ. మిగతాదంతా గాలికొదిలేశారు.
వసతి దీవెన కింద మన హయాంలో ప్రతి ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2025 మరో రూ.1100 కోట్లు. రెండేళ్లకు కలిపి రూ.2200 కోట్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లులు చదువులు మానుకుంటున్న పరిస్థితి.
అందరూ సీరియస్ గా ఆలోచన చేయాలని కోరుతున్నా.. ప్రజల్లోకి మీరు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా.. వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి?
ప్రభుత్వాలు ఇవి చేయకపోతే.. ప్రైవేటు ఎక్సŠాప్లయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే.. ప్రైవేటు హాస్పటళ్లలో ఈ దోపిడీ వల్ల ఏ పేదవాడికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యజమాన్యానికి ఫీజులు కట్టలేక..õ ³దలు తమ పిల్లలను చదవించలేని పరిస్థితులకు వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు వాళ్ల దెబ్బకు ఎవరూ కూడా.. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం సూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నడుపుతుంది. లేదంటే ప్రైవేటు దోపిడికి అడ్డూ అదుపూ ఉండదు.
ఈనెల 9 నుంచి కార్యాచరణ:
ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను సందర్శిస్తున్నాను. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది.
ఆ మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్గారిని కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం.
సేకరించిన కోటి సంతకాల పత్రాలు కూడా ఆయనకు అందజేస్తాం.
ఉద్యోగులకు తోడుగా..:
ఇది కాకుండా సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి, ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే, వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు.
వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి. అలా మనం ఉద్యోగులకు తోడుగా ఉన్నామన్న భరోసాను వారికి కల్పించడంతో పాటు, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.