ఆయన ఖాకీ యూనిఫాం తొడిగిన..
ఐఏఎస్..
తలపై పోలీసు టోపీ
పెట్టుకున్న ఎకానమిస్ట్..
చేతిలో లాఠీ పట్టుకున్న
పారిశ్రామిక విశ్లేషకుడు..
మొత్తంగా పోలీసు రూపంలోని
గొప్ప మేధావి..
మాదిరెడ్డి ప్రతాప్..
ఒకనాడు విజయనగరం జిల్లా
పోలీస్ సూపరింటెండెంట్ గా
చేసిన ఈ ఐపిఎస్ అధికారి
ప్రస్తుతంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రహదారి భద్రతా విభాగం
డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు..
విజయనగరంలో ఎస్పీగా పనిచేసి ఆనాడు పైడితల్లి ఉత్సవంలో ముఖ్య పోలీస్ అధికారిగా బందోబస్తుతో సహా ఎన్నో వ్యవహారాలను నిర్వహించి..పైడితల్లి అమ్మవారి పట్ల ఏర్పడిన ప్రత్యేక భక్తి ప్రపత్తులను పురస్కరించుకుని ఎక్కడున్నా గాని ఏటా పైడితల్లి ఉత్సవానికి రావడం అలవాటుగా పెట్టుకున్న ప్రతాప్ ఈ సంవత్సరం కూడా విజయనగరం వచ్చారు.
ప్రతాప్ ను నేను ఈరోజు కలిసాను..ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను కొన్నిసార్లు కలిసినా అప్పట్లో ఆయనతో అంత సన్నిహితంగా మాట్లాడే అవకాశం రాలేదు.ఎస్పీగా ఆయన మాట్లాడేవారు. జర్నలిస్టుగా నేను వార్త రాసేవాన్ని.
అయితే..ఇప్పుడు అదే మాదిరెడ్డి ప్రతాప్ తో మాట్లాడుతుంటే..ఆయన మాటలలో నదీ ప్రవాహ ఝరి.. ఆయన ఎదలో సాగర ఘోష.. ఆయన మస్తిష్కం ఆలోచనల పుట్ట..
ఐపిఎస్..
ఈ మూడు అక్షరాలను మించి ఆయనలో ఎన్నెన్నో లక్షణాలు..పోలీస్..ఈ వృత్తిని
దాటి ఎన్నిటినో నిక్షిప్తం చేసుకున్న మస్తిష్కం ఆయనది.
యూనిఫాం వేసుకుని వృత్తిని ఎంత నిబద్ధంగా.. నిర్భయంగా..నిజాయితీగా
నిర్వర్తించారో..వ్యక్తిగా సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగి..తాను పుట్టిన ఊరు..
పని చేస్తున రాష్ట్రం..మొత్తంగా తన జన్మభూమి పట్ల.. ఎంతో చిత్తశుద్ధి కలిగిన గొప్ప పౌరుణ్ణి ఆయనలో చూసాను.
ఎన్నో ప్రాంతాలు తిరిగారు.. ఇంచుమించు దేశం అంతా.. పర్యాటకుడిగా కాదు..
పరిశోధకుడుగా..
ఎన్ని దేశాలు చూసాడో.. ఆల్మోస్ట్..ప్రపంచం మొత్తం..
అధికారిగా కాదండోయ్.. విద్యార్థిగా.. అన్వేషిగా..
ఈ క్రమంలో ఎందరిని కలిసాడో ..తనకు తెలిసింది గాక ఇంకెన్ని నేర్చాడో..
సుందర్ పిచ్చయ్ సహాధ్యాయిగా కూడా ఉన్నాడు.ఆ పరిచయమే గూగుల్ ఇండియా రావడానికి కారణం అయింది.
ప్రపంచాన్ని చూసి.. చదివి నేర్చుకున్నది.. అవగాహన చేసుకున్నది.. ఆయన తన గొప్ప చెప్పుకోడానికి కాదు..
తన బుర్రలో నిక్షిప్తం చేసుకోడానికి అంతకంటే కాదు..తన స్వప్రయోజనాలకు వాడుకోవడానికి కానే కాదు.. ఈ దేశానికి..తన రాష్ట్రానికి.. తన ప్రజలకు ఉపయోగపడ్డానికి..
ప్రస్తుతం ఉన్నత అధికారిగా ఉన్నందున తన పరిమితికి.. పరిధికి లోబడి ప్రతాప్ ఎన్నో చేశారు. ఆయన చొరవతోనే శ్రీసిటీ ఆవిర్భవించింది. బ్రాండిక్స్ వచ్చింది..
ఓమీ బాబా ఆస్పత్రి అగనంపూడిలో పుట్టింది.
ఇది ఆయన చేసిన వాటిలో కొంతే..ఆయన ఆలోచనలలో కొన్నిటికి అవి
కార్యరూపమే అయినా మొత్తం ఆలోచనలన్నీ నిజరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోతుంది..
అధికారిగా ప్రతాప్ చేయదగినంతా చేశారు. పదవీ విరమణ చేసేలోగా ఇంకా చాలా చేస్తారు.
త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు ప్రతాప్.. అప్పుడు మొదలు కావాలి
మరోప్రస్థానం..అధికారిగా తాను చేసిన దానికి పైబడి.. సాధించిన విజయాలకు మించి..ఆయన చాలా చేయాల్సి ఉంది.
ఆయన ప్రతిభను..మేధస్సును ప్రభుత్వాలు వినియోగించుకుంటే మంచిదే..
కాదన్నప్పుడు..పారిశ్రామిక ..వ్యాపార విపణి వ్యవసాయరంగాలు.. ఆయనకు అవగాహన ఉన్న ప్రతి రంగంలోనూ ఆయన సేవలు వినియోగం కావాలి.. కావాల్సిన అవసరం ఉంది.
– ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్..విజయనగరం
7995666286
9948546286