-
పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ…
-
ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే సత్యానందరావు…..
రావులపాలెంలో ప్రజా సమస్యలు తిష్ట వేశాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెం గ్రామం పంచాయితీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ప్రజల సమస్యలు పేరుకుపోయాయని ఆ కష్టాల నుండి తొలగించాలని ప్రజా దర్బార్ లో వినతులు ఇస్తున్న అర్జీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి రామయ్య మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.